Israel : హమాస్ చెర నుండి విడుదలయ్యాక మొదటిసారి స్కూల్‌కి వెళ్లిన బాలిక ఎమోషనల్ వీడియో

హమాస్ చెరలో రెండు నెలలు బిక్కుబిక్కుమంటూ గడిపిన బాలిక ఇటీవలే బయటకు వచ్చింది. తిరిగి తన స్కూల్‌కి వెళ్లినపుడు ఆ చిన్నారి భావోద్వేగానికి గురైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Israel : హమాస్ చెర నుండి విడుదలయ్యాక మొదటిసారి స్కూల్‌కి వెళ్లిన బాలిక ఎమోషనల్ వీడియో

Israel

Israel : హమాస్ చెర నుండి బయటపడి తిరిగి పాఠశాలకు వెళ్లిన ఇజ్రాయిల్ బాలిక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తోటి విద్యార్ధులను కలిసినపుడు ఆ బాలిక పంచుకున్న క్షణాలు చూపరుల మనసు కదిలించాయి.

Hostages Released : యుద్ధం ప్రారంభమై రెండునెలల తర్వాత 24 మంది బందీలను విడుదల చేసిన హమాస్

తల్లీకూతుళ్లైన డేనియల్ అలోని (44), ఎమోలియా అలోని (5) లను అక్టోబర్ 7 న నిర్‌ ఓజ్‌లో హమాస్ ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్నారు. కాల్పుల విరమణలో భాగంగా తల్లీకూతుళ్లను నవంబర్ 24 న విడుదల చేశారు. రెండు నెలల పాటు ఉగ్ర చెరలో గడిపిన బాలిక డిసెంబర్ 5 న తిరిగి తన పాఠశాలకు వచ్చింది. ఉపాధ్యాయులు, తోటి విద్యార్ధులు ఎమోలియాను సంతోషంగా ఆహ్వానించారు.

స్కూలుని చూడగానే ఎలోనియాలో సంతోషం ఉప్పొంగింది. లోపలికి వెళ్లగానే స్కూలు సిబ్బంది ఒకరు ఆమెను ఆత్మీయంగా కౌగిలించుకున్నారు. ఆ తర్వాత స్నేహితులంతా ఒకరి తర్వాత ఒకరు హగ్ చేసుకున్నారు. రెండు నెలలుగా ఆమెను వారెంత మిస్ అయ్యారో ఆ వీడియో చూస్తే అర్ధం అవుతుంది. కొందరు చిన్నారులు ఆమె పేరు పలుకుతూ కేకలు వేయడం కూడా వినిపిస్తుంది. స్నేహితులందరినీ చూసిన తర్వాత ఆ అమ్మాయి సంతోషంలో మునిగిపోయింది.

Mossad to target Hamas leaders : హమాస్ నేతలు లక్ష్యంగా మొసాద్ స్పెషల్ ఆపరేషన్

@YosephHaddad అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియోకి ‘ రెండు నెలల క్రితం హమాస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన తర్వాత అమేలియా అలోని కిండర్ గార్డెన్‌‌కి తిరిగి వచ్చింది’ అనే క్యాప్షన్ ఇచ్చారు. నవంబర్ 24 న కాల్పుల విరమణలో భాగంగా 13 మంది ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేసింది.