Leena Nair: మరో విదేశీ సంస్థకు ఇండియన్ సీఈఓ.. లీనా నాయర్

ప్రపంచంలోని మల్టీ నేషనల్ కంపెనీలకు సీఈఓలుగా ఇండియన్లు ఏలుతున్నారు. టాప్ కార్పొరేట్ కంపెనీలలో సీఈఓలుగా 90శాతం భారతీయులే ఉండటం గమనార్హం. ఫ్యాషన్ సంస్థ ‘చానెల్‌’ సీఈవోగా భారత సంతతికి.

Leena Nair: మరో విదేశీ సంస్థకు ఇండియన్ సీఈఓ.. లీనా నాయర్

Chanal

Updated On : December 15, 2021 / 9:17 AM IST

Leena Nair: ప్రపంచంలోని మల్టీ నేషనల్ కంపెనీలకు సీఈఓలుగా ఇండియన్లు ఏలుతున్నారు. టాప్ కార్పొరేట్ కంపెనీలలో సీఈఓలుగా 90శాతం భారతీయులే ఉండటం గమనార్హం. గూగుల్‌, ట్విట్టర్‌, మైక్రోసాఫ్ట్‌, మాస్టర్ కార్డ్, అడోబ్, ఐబీఎమ్‌, పెప్సీకో లాంటి సంస్థల సీఈఓలు మనవాళ్లే. రీసెంట్ గా ఫ్రాన్స్‌కు చెందిన గ్లోబల్ లగ్జరీ ఫ్యాషన్ సంస్థ ‘చానెల్‌’ సీఈవోగా భారత సంతతికి చెందిన లీనా నాయర్ అపాయింట్ అయ్యారు.

ప్రస్తుతం లండన్‌లోని ఇంటర్నేషనల్‌ కన్జ్యూమర్‌ కంపెనీ యూనీలీవర్ సంస్థలో చీఫ్‌ హ్యూమన్‌ రీసోర్స్‌ ఆఫీసర్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2022 జనవరి నుంచి చానెల్‌ సీఈవో బాధ్యతలు స్వీకరించనున్నారు లీనా నాయర్.

ఛానెల్‌ సంస్థలకు సీఈవోగా నియమితురాలైన 52 ఏళ్ల లీనా నాయర్‌.. ఈ హోదా దక్కించుకున్న మొదటి మహిళ, అతిపిన్న వయస్కురాలు కావడం విశేషం. ఆసియా సంతతికి చెందిన వ్యక్తులు ఈ బాధ్యతలు స్వీకరించడం కూడా ఇదే తొలిసారి.

……………………………..: సౌత్ ఎంపీలతో పీఎం మోదీ సమావేశం

ఛానెల్‌ సంస్థలకు సీఈవోగా నియమితురాలైన 52 ఏళ్ల లీనా నాయర్‌.. ఈ హోదా దక్కించుకున్న మొదటి మహిళ, అతిపిన్న వయస్కురాలు కావడం విశేషం. అంతేకాదు ఆసియా సంతతికి చెందిన వ్యక్తులు ఈ బాధ్యతలు స్వీకరించడం కూడా ఇదే తొలిసారి.

లీనా నాయర్ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో పుట్టి పెరిగారు. స్వగ్రామంలోనే ప్రాథమిక విద్యను పూర్తి చేసి, సాంగ్లీలోని వాల్‌చంద్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి ఎలక్ట్రానిక్ట్స్‌ ఇంజినీరింగ్‌ చదివారు.

…………………………………… : పెళ్లి తర్వాత మొదటిసారి మీడియాకి చిక్కిన బాలీవుడ్ కొత్తజంట