2.4 బిలియన్ డాలర్ల వ్యయంతో కోహాలాలో 1,124 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి ఇటీవల చైనా కంపెనీ, పాకిస్తాన్ ప్రభుత్వాల మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో ఈ నిరసన చేపట్టారు.
చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సీ–పెక్‌లో భాగంగా దీన్ని నిర్మిస్తున్నారు. కోహాలా ప్రాజెక్ట్ వైపు తాము కవాతు చేయాలి మరియు అది ఆగకుండా అక్కడ నిరసన కొనసాగించాలి అని నిరసనకారులలో ఒకరు చెప్పారు.
‘సేవ్ రివర్స్, సేవ్ ఏజేకే’ పేరుతో సోషల్ మీడియాలో కూడా క్యాంపైన్ స్టార్ట్ చేశారు. ఏ ప్రాతిపదికన ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన ఒప్పందాలు ఏ ప్రాతిపదికన చేసుకున్నారని నిరసనకారులు ప్రశ్నించారు. పాకిస్తాన్ మరియు చైనా మధ్య వివాదాస్పద ప్రాంతం యొక్క నది ఒప్పందం ఏ చట్టం క్రింద ఉందని నిరసనకారులు ప్రశ్నించారు.
ఈ విషయంలో చైనా-పాక్ రెండు దేశాలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని స్పష్టం చేశారు. అయితే ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపే వరకు నిరసన కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. పాకిస్తాన్ మరియు చైనా నిర్మించే ఆనకట్టల వల్ల తలెత్తే పర్యావరణ ప్రభావాలను నిరసనకారులు ఎత్తిచూపారు.
Read Here>>భారత్- చైనా బోర్డర్ లో IAF నైట్ ఆపరేషన్స్…