Ants Detect Cancer Cells
Scientists Discover Ants Can Identify Cancerous Cells: చీమల్ని చూసి మనిషి నేర్చుకునేవి ఎన్నో ఉన్నాయి. క్రమశిక్షణ పాటించటంలో చీమల్ని మించిన జీవులు లేవు ఈ భూమ్మీద అంటారు శాస్త్రవేత్తలు సైతం. అంతేకాదు చీమలు కష్ట జీవులు.ప్రతి క్షణం కష్టపడుతునే ఉంటాయి.టీమ్ వర్క్ చేయటంతో చీమల్ని మించిన ప్రాణి లేదని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
అటువంటి చీమల గురించి శాస్త్రవేత్తలు మరో కొత్త విషయం చెప్పారు. ‘చీమలు మనిషిలోని క్యాన్సర్ కణాలను గుర్తిస్తాయి’అని శాస్త్రవేత్తలు తెలిపారు. మనిషి ఆరోగ్యంగా ఉండటం కోసం ఎన్నో పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలు తమ తాజా అధ్యయనంలో చీమలు అత్యంత సులభంగా మానవుని శరీరంలోని క్యాన్సర్ కణాలను సులభంగా గుర్తించగలవు అని కనుగొన్నారు. కుక్కలు క్యాన్సర్ ను పసిగడతాయని తెలుసుకున్నాం. కానీ చిన్నపాటి చీమలు కూడా తమ వాసన సామర్థ్యంతో క్యాన్సర్ కణాలను గుర్తిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Read more : చిట్టి చీమలు-గట్టి సందేశం : భౌతిక దూరం పాటిస్తూ..శానిటైజ్ చేసుకునే చిన్ని ప్రాణుల్ని చూసి నేర్చుకోవాల్సిందే
చీమలు క్యాన్సర్ కణాలను గుర్తించేందుకు వాటి వాసన సామర్థ్యాన్ని ఉపయోగించగలు అని శాస్త్రవేత్తల బృందం కనుగొంది. ఈ పరిశోధనలుల చేయడానికి సిల్కీ చీమలు అని పిలిచే ‘‘ఫార్మికా ఫుస్కా’’ అనే చీమలను వినియోగించింది. వాటికి రివార్డ్ సిస్టమ్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చింది. చీమలు తమ వాసన సామర్ధ్యంతో ఆహారాన్ని సంపాదించుకుంటాయి. అలా వాటి వాసనా శక్తితో మానవునిలోని క్యాన్సర్ కణాల నంచి ఆరోగ్యకరమైన కణాలను వేరుచేయగలవు అని ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ (French National Center for Scientific Research)(CNRS) ఒక ప్రకటనలో తెలిపింది.
దీనికి సంబంధించిన శాస్త్రవేత్త బృందం చాలా సమర్ధవంతంగా క్యాన్సర్‌ని నయం చేసే పద్ధతులను కనుగొనే క్రమంలోనే ఈ అద్భుతమైన విషయాన్ని కనుగొన్నారు. మానవ క్యాన్సర్ కణాలను గుర్తించడానికి చీమను జీవన సాధనాలుగా ఉపయోగించడం అత్యంత సులభమైనది. అంతేకాదు తక్కువ శ్రమతో కూడినదని పరిశోధకులు చెబుతున్నారు. అలా క్యాన్సర్ కణాలను గుర్తించటానికి చీమలకు శాస్త్రవేత్తలు ట్రైనింగ్ ఇచ్చారు.ఎలాగంటే..ఈ చీమలకు చక్కెర ద్రావణంతో వాసనకు సంబంధించిన ట్రైనింగ్ ఇచ్చి..ఆ తర్వాత అవి క్రమంగా రెండు వేర్వేరు రకాల క్యాన్సర్ కణాలను గుర్తించుకునే స్థాయికి చేరుకునేలా చేశారు. అలా చీమలు క్యాన్సర్ కణాలను గుర్తించటానికి వాటి వాసనాశక్తే కారణం అని కనుగొన్నారు.
Read more : బాబోయ్ : ఎర్ర చీమలతో పచ్చడి చేసుకుని తింటున్నారు
అలా వాటిని చక్కటి ట్రైనింగ్ ఇచ్చి వాటి సామర్థ్యాన్ని మానవుడిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి అంచనా వేయాల్సి ఉందని తెలిపారు. అయితే ఈ మొదటి అధ్యయనం చీమలు అధిక సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని..చాలా త్వరగా, తక్కువ ఖర్చుతో నేర్చుకోవడమే కాక సమర్థవంతంగా పనిచేస్తాయని తేలిందని శాస్త్రవేత్తలు తెలిపారు. అంతేగాదు ఈ చీమలు మాదక ద్రవ్యాలు, పేలుడు పదార్థాలు లేదా ఇతర వ్యాధులకు సంబంధించిన వాసనలను కూడా పసిగట్టే సామర్థ్యం పై కూడా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. చీమలకు మంచి ఘ్రాణ శక్తి కలిగి ఉందని..పైగా కుక్కుల కంటే చాలా త్వరగా క్యాన్సర్ కణాల గుర్తింపు శిక్షణను చీమలు తీసుకుంటాయని వెల్లడించారు.