At Least 14 Killed After Several Explosions Rock Afghanistan
Afghanistan : అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్ నగరమైన మజార్-ఇ-షరీఫ్‌లో వరుస బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. బుధవారం జరిగిన నాలుగు పేలుళ్లలో కనీసం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. తాలిబాన్ పాలనను వ్యతిరేకిస్తున్న ఇస్లామిక్ స్టేట్ (IS) గ్రూప్ వరుస బాంబు దాడులకు పాల్పడి ఉండొచ్చునని పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. పోలీస్ డిస్ట్రిక్ట్ (PD)4లో బుధవారం (మే 24) సాయంత్రం ప్రార్థనల సమయంలో మసీదులో పేలుడు సంభవించింది. కాబూల్‌లో కనీసం ఐదుగురు మృతిచెందగా.. మరో 17 మంది గాయపడ్డారు.
At Least 14 Killed After Several Explosions Rock Afghanistan
హజ్రత్-ఎ-జెక్రియా మసీదులో ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించిందని జిన్హువా వార్తా సంస్థ నివేదించింది. మజార్-ఇ-షరీఫ్‌లోని పిడి 10, పిడి 5లో మూడు వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. మూడు వ్యాన్-బస్సులను ఢీకొన్న ఒక గంట తర్వాత ఈ పేలుడు సంభవించింది.
? #Afghanistan #Kabul Explosion at a mosque in PD4 neighborhood. 22 wounded people arrived at our hospital, 5 already dead on arrival.
— EMERGENCY NGO (@emergency_ngo) May 25, 2022
ఈ పేలుళ్ల ఘటనలో తొమ్మిది మంది మరణించగా.. మరో 15 మంది గాయపడ్డారని పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి, ప్రావిన్షియల్ మహ్మద్ ఆసిఫ్ వజీరి జిన్హువాతో చెప్పారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా పెట్టుకున్న ఉగ్రవాదులు ఈ వరుస బాంబుదాడులకు పాల్పడి ఉండొచ్చునని భావిస్తున్నారు. అయితే ఈ దాడులకు బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద గ్రూపు ప్రకటించలేదు.
Read Also : Texas School : టెక్సాస్‌లో మారణహోమం.. మరుసటిరోజే స్కూల్ బయట తుపాకీతో మరో విద్యార్థి..!