స్కూల్లో కాల్పులు జరిపి నలుగురి ప్రాణాలు తీసిన 14 ఏళ్ల పిల్లాడు.. మరో 14 మందికి గాయాలు

కాల్పుల శబ్దాలు వినపడ్డప్పుడు తాను క్లాస్ రూమ్‌లో ఉన్నానని, దీంతో ఒక టీచర్‌ వచ్చి..

స్కూల్లో కాల్పులు జరిపి నలుగురి ప్రాణాలు తీసిన 14 ఏళ్ల పిల్లాడు.. మరో 14 మందికి గాయాలు

Crime

అమెరికాలోని జార్జియా, బారో కౌంటీలో 14 ఏళ్ల ఓ పిల్లాడు కలకలం రేపాడు. అపలాచీ హైస్కూల్లో కాల్పులు జరిపి నలుగురి ప్రాణాలు తీశాడు. ఈ ఘటనలో మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. కాల్పుల ఘటనతో భయాందోళనలకు గురైన విద్యార్థులు ఫుట్‌బాల్‌ స్టేడియం వైపునకు పరుగులు తీశారు.

అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించినట్లు అధికారులు తెలిపారు. కాల్పుల జరిపిన పిల్లాడు అదే స్కూల్‌ విద్యార్థా? అన్న వివరాలు తెలియాల్సి ఉంది. అతడు ఎందుకు ఈ కాల్పులు జరిపాడన్న విషయాన్ని పోలీసులు దర్యాప్తులో తేల్చనున్నారు.

కాల్పుల శబ్దాలు వినపడ్డప్పుడు తాను క్లాస్ రూమ్‌లో ఉన్నానని, దీంతో ఒక టీచర్‌ వచ్చి గడియ పెట్టుకోవాలని చెప్పి వెళ్లారని ఓ విద్యార్థి మీడియాకు తెలిపారు. కాల్పుల ఘటన గురించి తెలియడంతో విద్యార్థుల తల్లిదండ్రులు స్కూలుకి పరుగున వచ్చి తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లారు. అమెరికాలో కాల్పుల ఘటనలు తరుచూ చోటుచేసుకుంటున్నాయి.

ALso Read: ఆపద్బాంధవి.. డ్రోన్.. మనిషికి తోడుగా.. చేదోడుగా డ్రోన్!