Mexico : ఘోర ప్రమాదం 49 మంది మృతి.. 40 మందికి గాయాలు

మెక్సికోలో (Mexico) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలసదారులతో వెళ్తున్న ట్రక్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 49 మంది వలసదారులు మృతి చెందినట్లు సమాచారం.

Mexico

Mexico : మెక్సికోలో (Mexico) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలసదారులతో వెళ్తున్న ట్రక్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 49 మంది వలసదారులు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటన దక్షిణ రాష్ట్రమైన చియపాస్‌లో చోటుచేసుకుంది. సుమారు 100 మంది వలసదారులతో వెళ్తున్న ట్రక్కు రిటైనింగ్ గోడను ఢీకొంది. దీంతో 49 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో 40 మంది గాయపడినట్లుగా వివరించారు.. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

చదవండి : Sangam Auto Accident : సంగం ఆటో ప్రమాదం.. వాగులో గల్లంతైన ప్రయాణికుల కోసం ముమ్మర గాలింపు

వారంతా వలసకార్మికులని, సరైన ధృవపత్రాలు లేకుండా అక్రమంగా అమెరికాకు వెళ్తున్నారని స్థానిక ప్రాసిక్యూటర్ కార్యాలయం ప్రకటించింది. వారు ప్రయాణిస్తున్న ట్రక్కు అదుపుతప్పి చియాపాస్‌లో రిటైనింగ్ గోడను ఢీకొని బోల్తా పడిందని చెప్పారు. వారంతా ఏదేశానికి చెందినవారనే విషయం ఇంకా తెలియరాలేదన్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర గవర్నర్ రుటిలియో ఎస్కాండన్ సంతాపం తెలిపారు. మృతులను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

చదవండి : Mexico Covid 3rd Wave : మెక్సికోలో కొవిడ్ మూడో దశ మొదలైంది.. యువతలోనే 29శాతం అధికం!