డబ్బులు కావాలంటే.. ముఖం చూపించాల్సిందే

మనకు డబ్బులు కావాలంటే.. ATM కు వెళ్లి ఆ మెషీన్‌లో కార్డు ఉంచి పిన్ నంబర్ ఎంటర్ చేసి.. కావాల్సిన డబ్బులు తీసుకుంటాం. అయితే ఆ పిన్ నంబర్ మర్చిపోయినా.. వేరే వ్యక్తులకు ఎవరికైన ఆ నంబర్ తెలిసినా ఇబ్బందులు తప్పవు. అందుకే స్పెయిన్‌లోని బార్సి సిటీలో ఉన్న కెయిక్సా బ్యాంకు ఓ టెక్నాలజీని వాడుకుంటోంది.. అదేంటంటే మన ముఖాన్ని గుర్తుపట్టి డబ్బులు ఇచ్చే నూతన సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. ఫేస్ రికగ్నిషన్ ద్వారా డబ్బులు ఇచ్చే ATM ఏర్పాటు చేయడం ప్రపంచంలోనే ఇది తొలిసారి కావడం విశేషం.
ఈ టెక్నాలజీ ద్వారా మన డబ్బు ఎంతో సేఫ్‌గా డ్రా చేసుకోవచ్చని బ్యాంకు చైర్మన్ జోర్డీ గాల్ తెలిపారు. ATM లోని కెమెరా మన ముఖంలోని దాదాపు 16 వేల అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే మనకు డబ్బు ఇస్తుందట. ఈ ఏడాది చివరికి బార్సిలోనా పట్టణంలో అన్ని ATM కేంద్రాల్లో ఈ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు కెయిక్సా బ్యాంకు CEO గొంజాలో చెబుతున్నారు.