Global Liveability Index 2021 : ప్రపంచంలో అత్యంత నివాసయోగ్య నగరం అదే!

లండన్ కి చెందిన ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్(EIU) తాజాగా విడుదల చేసిన గ్లోబల్ లివబులిటీ ఇండెక్స్ 2021 సర్వే ప్రకారం..ప్ర‌పంచ వ్యాప్తంగా అత్యంత నివాసయోగ్యమైన నగరాల జాబితాలో..

Global Liveability Index 2021 : ప్రపంచంలో అత్యంత నివాసయోగ్య నగరం అదే!

University (1)

Updated On : June 9, 2021 / 5:23 PM IST

Global Liveability Index 2021 లండన్ కి చెందిన ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్(EIU) తాజాగా విడుదల చేసిన గ్లోబల్ లివబులిటీ ఇండెక్స్ 2021 సర్వే ప్రకారం..ప్ర‌పంచ వ్యాప్తంగా అత్యంత నివాసయోగ్యమైన నగరాల జాబితాలో న్యూజిలాండ్ దేశంలో ఆక్లాండ్(96.0) టాప్ లో నిలిచింది. జపాన్ లోని ఒసాకా(94.2) రెండో స్థానంలో,ఆస్ట్రేలియాలోని అడిలైడ్(94.0) మూడో స్థానంలో,న్యూజిలాండ్ లోని వెల్లింగ్టన్(93.7)నాలుగో స్థానంలో,జపాన్ లోని టోక్స్(93.7)ఐదవ స్థానంలో,ఆస్ట్రేలియాలోని పెర్త్(93.3)ఆరవ స్థానంలో,స్విట్జర్లాండ్ లోని జూరిచ్(92.8)ఏడవ స్థానంలో,స్విట్జర్లాండ్ లోని జెనీవా(92.5)ఎనిమిద స్థానంలో,ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్(92.5)తొమ్మిదవ స్థానంలో,ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్(92.4)10 వ స్థానంలో నిలిచాయి.

ఐదు కేటగిరీలు..స్థిర‌త్వం (25 శాతం), ఆరోగ్య సంర‌క్ష‌ణ (20 శాతం), సంస్కృతి, పర్యావ‌ర‌ణం (25 శాతం), విద్య (10 శాతం), మౌలిక స‌దుపాయాలు (20 శాతం)ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని న‌గ‌రాల‌కు ర్యాంకులు కేటాయించారు. ప్ర‌పంచంలోని నివాస‌యోగ్య న‌గరాల జాబితాపై కరోనా కూడా తీవ్ర ప్ర‌భావమే చూపింది. ఈసారి ప్ర‌పంచంలో అత్యంత నివాస‌యోగ్య న‌గ‌రాల జాబితాను త‌యారు చేయ‌డంలో కొవిడ్ క‌ట్ట‌డి అనేది కీల‌క పాత్ర పోషించింది. అందుకే ఈ మ‌హ‌మ్మారిని స‌మ‌ర్థంగా ఎదుర్కొన్న దేశాల్లో ఒక‌టైన న్యూజిలాండ్‌కు చెందిన ఆక్లాండ్ ఈసారి అత్యంత నివాస‌యోగ్య నగ‌రంగా నిలిచింది. అదొక్క‌టే కాకుండా విద్య‌, సంస్కృతి, ప‌ర్యావ‌ర‌ణం విష‌యంలోనూ ఈ న‌గ‌రానికి మంచి మార్కులే వ‌చ్చాయి. అదే స‌మ‌యంలో గ‌త రెండేళ్లుగా టాప్‌లో ఉన్న ఆస్ట్రియా రాజ‌ధాని వియ‌న్నాకు మాత్రం టాప్ టెన్‌లోనూ చోటు ద‌క్క‌లేదు. అక్క‌డ క‌రోనా కేసులు భారీగా న‌మోద‌వ‌డ‌మే దీనికి కార‌ణం. ఆ న‌గ‌రం 12వ స్థానంతో స‌రిపెట్టుకుంది. ఈసారి టాప్‌లో ఉన్న న‌గ‌రాల‌ను చూస్తే వాటిలో చాలా వ‌ర‌కూ కొవిడ్‌ను స‌మ‌ర్థంగా క‌ట్ట‌డి చేసిన‌వే.

యురోపియ‌న్ న‌గ‌రాలు ఈసారి త‌మ టాప్ స్థానాల‌ను కోల్పోయాయి. క‌రోనా వ‌ల్ల తీవ్రంగా ప్ర‌భావిత‌మైన దేశాల్లో యురోపియ‌న్ దేశాలే ముందు వ‌రుస‌లో ఉన్నాయి. ఆస్ట్రియాలో అయితే ఏకంగా ఆరోగ్య శాఖ మంత్రే త‌న వ‌ల్ల కాదంటూ రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. 90 ల‌క్ష‌ల జ‌నాభా ఉన్న ఈ దేశంలో సుమారు 6 ల‌క్ష‌ల వ‌ర‌కూ కేసులు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం.

ఇక,ప్రపంచవ్యాప్తంగా నివాసయోగ్యానికి అనుకూలంగా లేని టాప్-10 నగారాల జాబితాలో.. డమాస్కస్(సిరియా)మొదటి స్థానంలో నిలిచింది. లాగోస్(నైజీరియా)రెండో స్థానంలో,పోర్ట్ మెరిస్బే(పపువా న్యూగినియా)మూడో స్థానంలో,ఢాకా(బంగ్లాదేశ్)నాలుగో స్థానంలో,అల్జీర్స్(అల్జీరియా)ఐదో స్థానంలో,ట్రిపోలి(లిబియా)ఆరో స్థానంలో,కరాచీ(పాకిస్తాన్)ఏడో స్థానంలో,హరారే(జింబాంబ్వే)ఎనిమిద స్థానంలో,డౌలా(కామెరూన్),కారకస్(వెనిజులా)సిటీ 10వ స్థానంలో నిలిచింది.