Petrol bunks in space : అంతరిక్షంలో పెట్రోల్‌ బంకులు..

భూమ్మీదే కాదు అంతరిక్షంలో కూడా పెట్రోల్ బంకులు ఏర్పాటు కానున్నాయి. దీని కోసం ప్రయోగాలు రెడీ అయ్యాయి.అంతరిక్షంలో పెట్రోల్‌ బంకులు..ప్రయోగాలకు నాసా గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది.

Petrol bunks in space : అంతరిక్షంలో పెట్రోల్‌ బంకులు..

Petrol Bunks In Space

Updated On : December 7, 2021 / 3:46 PM IST

Petrol bunks in space : ఇంత అంతరిక్షంలో కూడా పెట్రోల్ బంకులు ఏర్పాటు కానున్నాయట. దీని కోసం నాసా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ప్రస్తుతం భూమ్మీద పెట్రోల్ రేట్ ఏరేంజ్ లో ఉందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. సెంచరీ దాటేసి చాలా వారాలు అయ్యింది. ఇక అంతరిక్షంలో పెట్రోల్ బంకులా?అక్కడి వెళ్లేదెలా? పెట్రోల్ పోయించుకునేదెలా? ఇదంతా అయ్యేపని కాదనుకుంటున్నారా? అసలు అక్కడ పెట్రోల్ బంకులేంటీ? అని అనుకుంటున్నారా? టెక్నాలజీ డెవలప్ మెంట్ దేన్నైనా సాధ్యం చేస్తుందనటానికి ఇదొక అడుగు అని ఎందుకు అనుకోకూడదు? ఇంతకీ అంతరిక్షంలో పెట్రోల్ బంకుల విశేషాలంటో తెలిసేసుకుందాం..

Read more : Andhra Pradesh: రూ.15వందల కోట్ల గంజాయిని ధ్వంసం చేసిన పోలీసులు

ఇటీవల రష్యా అంతరిక్షంలో యాంటీ శాటిలైట్ మిస్సైల్ పరీక్షలో భాగంగా తన సొంత శాటిలైట్‌ను పేల్చేసింది. దీంతో శాటిలైట్‌కు చెందిన 1,500కు పైగా ఉపగ్రహ శకలాలు 2000 కి.మీ ఎత్తులో ఉండే భూ కక్ష్య లో (ఎల్ఈఓ)లో తిరుగుతున్నాయి. రష్యా చేసిన ఈ పనిపై అమెరికా మండిపడింది. రష్యా చేసిన ఈ అనాలోచిత పనివల్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లోని సిబ్బంది ప్రాణ భయంతో ఐఎస్ఎస్ క్యాప్సూల్స్‌లో దాక్కోవాల్సి వచ్చిందంటూ మండిపడింది.

ఇలా శాటిలైట్లను పేల్చడంతో వాటి శకలాల వల్ల ఉపగ్రహాలకు నష్టం జరిగే ప్రమాదముంది. అందుకే పలు దేశాల అంతరిక్ష పరిశోధనా సంస్థలు..ఆ శకలాలు ఉపగ్రహాలపై నిలిపటానికి ప్రయత్నిస్తున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన న్యూమన్‌ స్పేస్‌ సంస్థ ‘ఇన్‌ స్పేస్‌ ఎలక్ట్రిక్‌ ప్రొపల్షన్‌’ పేరుతో కాలం చెల్లిన ఉగప్రహాల శకలాలు, రాకెట్ల విడిబాగాలతో అంతరిక్షంలో థ్రస్ట్‌ పుట్టుకొచ్చేలా ప్రయోగాలు ప్రారంభించింది. అంటే అంతరిక్షంలో రాకెట్లు ముందుకు ప్రయాణించడానికి ఈ థ్రస్ట్‌ ఉపయోగపడుతుంది.

Read more : ప్రపంచ వ్యాప్తంగా వెయ్యికి చేరువలో ఒమిక్రాన్ కేసులు..!_ Omicron Cases Rising

థ్రస్ట్‌ రాకెట్ ప్రొపల్షన్ సిస్టమ్ ద్వారా ఉత్పత్తి అవుతుంది. అలా థస్ట్‌ రావాలంటే ఇంధనం అవసరం పడుతుంది. అందుకే థస్ట్‌ల కోసం స్పేస్‌లోనే శకలాలతో ఇంధనం తయారు చేయనున్నారు పరిశోధకులు. ఒకరకంగా దీన్ని అంతరిక్షంలో పెట్రోల్‌ బంక్‌లను ఏర్పాటు చేయడంలాంటిదే నన్నమాట. భవిష్యత్తులో ఇటువంటి అవసరాలకోసం నాసా ప్రయోగాలు చేయటానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో న్యూమన్‌ స్పేస్‌ సంస్థ ఈ ప్రయోగాలకు రెడీ అవుతోంది. ఈ ప్రయోగాలు పూర్తయితే అంతరిక్షంలో కూడా ఇంధనం దొరకనుంది.