Claire Polosack first female umpire in men’s Test cricket : సిడ్నీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్ లో అరుదైన దృశ్యం ఆవిషృతమైంది. రిత్రలో మొదటిసారిగా టెస్ట్ క్రికెట్ లో ఓ మహిళ ఎంపైరర్ గా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మ్యాచ్ లో తొలి మహిళా అంపైర్ గా విధులు నిర్వహిస్తూ చరిత్ర సృష్టించారు ఆస్ట్రేలియాకు చెందిన 32 ఏళ్ల మహిళ క్లెయిర్ పోలోసాక్. పురుషుల టెస్ట్ క్రికెట్ లో తొలి మహిళా అంపైర్ గా క్లెయిర్ పోలోసాక్ చరిత్ర సృష్టించారు.
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా మూడో టెస్టు గురువారం (జనవరి 7,2021) కొనసాగుతోంది. సిడ్నీ వేదికగా జరిగే ఈ మ్యాచ్ ఓ అరుదైన నియామకానికి వేదికగా నిలిచింది. చరిత్రలో తొలిసారిగా ఓ మహిళా అంపైర్ పురుషుల టెస్టు క్రికెట్ లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన క్లెయిర్ పోలోసాక్ సిడ్నీ టెస్టులో ఫోర్త్ అంపైర్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ టెస్టుకు పాల్ రీఫెల్, పాల్ విల్సన్ ప్రధాన అంపైర్లు కాగా, బ్రూస్ ఆక్సెన్ ఫోర్డ్ థర్డ్ అంపైర్ గా వ్యవహరిస్తుండగా..వీరితోపాటే క్లెయిర్ పోలోసోక్ మ్యాచ్ నిర్వహణలో 4th అంపైర్ పాలుపంచుకున్నారు.
క్లెయిర్ పోలోసాక్ గతంలో పురుషుల వన్డే క్రికెట్ లో మొట్టమొదటి మహిళా అంపైర్ గా రికార్డు సృష్టించారు. 2019లో జరిగిన వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్-2 పోటీల్లో నమీబియా, ఒమన్ జట్ల మధ్య జరిగిన వన్డేకు అంపైర్ గా వ్యవహరించారు. టెస్టు క్రికెట్ లోనూ తనకు అవకాశం దక్కడం పట్ల క్లెయిర్ పోలోసాక్ మాట్లాడుతూ..ఇది చాలా సంతోషకరమైన విషయమని..కానీ ఇది ప్రారంభం మాత్రమేనని..తనలాగే ఇంకా ఎంతోమంది మహిళలు ఎంపైర్ గా పయనిస్తారని ఆశిస్తున్నానని ఆమె ఆశాభావం వ్యక్తంచేశారు.
న్యూ సౌత్ వేల్స్‌కు చెందిన ఈ 32 ఏళ్ల క్లెయిర్ పోలోసాక్ ఇప్పటికే ఐసిసి డివిజన్ 2 లీగ్‌లో నమీబియా-ఒమన్ మధ్య 2019 లో విండ్‌హోక్‌లో ఆడిన పురుషుల వన్డే మ్యాచ్‌లో మైదానంలో అంపైర్‌గా తొలి మహిళగా గుర్తింపు పొందిందిన విషయం తెలిసిందే. పోలోసాక్ ఆస్ట్రేలియాలో పురుషుల జాబితా ఎ గేమ్‌లో మొదటి మహిళా మ్యాచ్ ఆఫీసర్ అనే ఘనత కూడా దక్కించుకున్నారు.
2019లో జరిగిన వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్-2 పోటీల్లో నమీబియా, ఒమన్ జట్ల మధ్య జరిగిన వన్డేకు అంపైర్ గా వ్యవహరించారు. కానీ టెస్టు క్రికెట్ కి మొదటిసారిగా క్లెయిర్ పోలోసాక్ ప్రాధాన్యత వహించడం నిజంగా మహిళలకు సముచిత స్థానం దక్కినట్లేనని అంటున్నారు క్రికెట్ అభిమానులు.