కొండచిలువల రోమాన్స్..నష్టపోయిన ఇంటి యజమాని

  • Published By: madhu ,Published On : September 3, 2020 / 09:23 AM IST
కొండచిలువల రోమాన్స్..నష్టపోయిన ఇంటి యజమాని

Updated On : September 3, 2020 / 10:37 AM IST

కళ్ల ముందు పాము కనబడితే..వామ్మో అంటు పరుగెత్తుతాం. అదే రెండు పెద్ద పెద్ద కొండచిలువలు ఇంట్లో దర్శనమిస్తే..ఎలా ఉంటుంది. అది..ఒకదానితో ఒకటి పట్టుకొంటే…ఇంకేమన్నా ఉందా..పై ప్రాణాలు పోవు..అంటారు కదా. కొండ చిలువల రొమాన్స్‌కు ఓ ఇంటి యజమాని నష్టపోయాడు. క్వీన్స్‌లాండ్‌లోని ఓ ఇంట్లోని కిచెన్‌ పైకప్పుపై 45 కిలోల బ‌రువున్న రెండు భారీ కొండ‌చిలువ‌లు ఆవాసం ఏర్పరచుకున్నాయి.



కిచెన్ సీలింగ్ నుంచి రెండు పెద్ద పాములు వేలాడుతూ కనిపించాయి. వీటిని చూసిన యజమానికి భయం వేసింది. ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశాడు. వాటి బ‌రువుకు కిచెన్ పైక‌ప్పు కూలిపోయింది. దీంతో నివ్వెర‌పోయిన ఇంటి యజమాని స్నేక్ క్యాచర్‌ను పిలిపించి వాటిని బంధించాడు. ఇందులో ఒకటి 2.9 మీటర్ల పొడవుంటే.. మరొకటి 2.5 మీట‌ర్ల పొడవుంది.

అయితే.. ప్రస్తుతం వాటి సంతానోత్పత్తి కాలం కావ‌డంతో మ‌గ పైథాన్‌లు ఆడ పైథాన్‌ కోసం పోరాటం చేస్తున్న సమయంలో పైకప్పు కూలిందని స్నేక్ క్యాచర్ చెబుతున్నాడు. ఆడ పైథాన్‌ కూడా ఆ ఇంటి సమీపంలోనే ఉండి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాడు. పాములను పట్టుకున్న వ్యక్తి వాటిని ఫోటోలు తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్త వైరల్ అయ్యింది.