covid-19 వ్యాక్సిన్‌ వేయించుకున్న యువతి..రూ 7.4 కోట్లు గెలుచుకుంది..!!

covid-19 వ్యాక్సిన్‌ వేయించుకున్న యువతి..రూ 7.4 కోట్లు గెలుచుకుంది..ఎలాగంటే..

women wins RS.7.4 crores getting covid vaccinated  కోవిడ్ ను నియంత్రించాలంటే వ్యాక్సిన్ తప్పనిసరి. కానీ ఒక్క భారత్ లోనేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ప్రజలు వ్యాక్సిన్ వేయించుకోవటానికి ముందుకు రావటంలేదు. దీంతో ప్రజలందరూ వ్యాక్సిన్‌లు తీసుకునేలా అధికారులు రకరకాల అవగాహన కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. అలాగే ఎన్నో గిఫ్టుల్ని ఇస్తామంటు ప్రకటించిన సందర్భాలు ఎన్నో. అటువంటిదే జరిగింది ఆస్ట్రేలియాకలో. వ్యాక్సిన్ వేయించుకునేలా ప్రభుత్వం రకరకాల కార్యక్రమాలు చేపట్టింది. అంతేకాదు భారీ ప్రోత్సాహకాలను ప్రకటించింది.

Read more : No Vaccine No Salary: వ్యాక్సిన్ వేయించుకోకపోతే జీతాలివ్వం: కలెక్టర్ ఉత్తర్వులు

కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకుంటే..ఫ్రీగా బీర్‌లు ఇస్తామని..అలాగే ఆయా ప్రాంతాల్లో అధికా ధరలు ఉండే ఆహారపదార్థాలు ఇస్తామని ప్రకటించింది. అంతేకాదు లాటరీ టికెట్లు ఇస్తామని కూడా ప్రకటించింది. అలాగే చాలామంది స్వచ్ఛంగా వ్యాక్సిన్ మీద అవగాహన కార్యక్రమలు చేపట్టారు. దీంట్లో భాగంగానే ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రవేట్‌ కంపెనీల మానవతావాదులు ది మిలియన్ డాలర్ వ్యాక్స్ అలయన్స్ లాటరీని రూపొందించారు. కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకుంటే లాటరీ టిక్కెట్లు ఇస్తామని ప్రకటించింది. దీంతో ప్రజలనుంచి భారీ స్పందన వచ్చింది. వ్యాక్సిన్ వేయించుకోవటానికి భారీ సంఖ్యలో జనాలు కదిలివచ్చారు.

30 లక్షల మంది ప్రజలు కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవటమే కాక ఈ లక్కీ డ్రాలో తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. అలా 25 ఏళ్ల జోవాన్ ఝూ అనే మహిళ కూడా వ్యాక్సిన్ వేయించుకుని డ్రాలో తన పేరు నమోదు చేయించుకోగా..ఝూ 1 మిలియన్ డాలర్ల లాటరీ గెలుచుకుంది. ఆమెకు సదరు లక్కీ డ్రా అధికారులు ఫోన్ చేసి మీకులాటరీ తగిలిందని చెప్పటంతో ఝూ తన మాటల్ని తానే నమ్మలేకపోయింది.

Read more :Crazy Offer: వ్యాక్సిన్ వేయించుకుంటే..గంజాయి మొక్కలు ఫ్రీ..!ఎక్కడో తెలిస్తే షాకే..!! 

ఈ లాటరీలో వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని ఝూ తమ కుటుంబ సభ్యుల కోసం వెచ్చించడమే కాక మిగిలి డబ్బుని భవిష్యత్తు అవసరాల కోసం దాచిపెట్టుకుంటానని ఝూ తెలిపింది. తనకు లాటరీ తగిలిందనే విషయాన్ని తాను ఇంకా నమ్మలేకపోతున్నానని పట్టరాని సంతోషంగా తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు