ఆ గ్రామానికి టూరిస్టుల బెడద : Insta ఫొటోల కోసం క్యూ!

  • Publish Date - January 7, 2020 / 02:04 PM IST

పర్యాటక ప్రాంతాలకు టూరిస్టులు తరలి వెళ్లడం కామన్. సుందరమైన ప్రాంతాలకు పర్యాటకులు వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు. ఫొటోలు దిగుతుంటారు. ప్రకృతి అందాలను ఆశ్వాదిస్తూ ఫొటోలు, వీడియోలతో ఆ క్షణాలను తమ ఫోన్లలో బంధిస్తుంటారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి వచ్చిన లైకులు, కామెంట్లతో మురిసిపోతుంటారు. టూరిస్ట్ స్పాట్ కనిపిస్తే చాలు.. పర్యాటకులు ఒక్కసారిగా వాలిపోతుంటారు.

కానీ, ఆస్ట్రేలియాలోని ఓ గ్రామానికి టూరిస్టుల బెడద వెంటాడుతోంది. ఎంత వద్దన్నా టూరిస్టులు వేల సంఖ్యలో తరలివస్తున్నారంట. ఇక్కడ అంతగా అద్భుతమైన ప్రదేశాలు ఏమున్నాయి. ఎందుకు టూరిస్టులు ప్రత్యేకించి ఈ గ్రామానికే తరలివస్తున్నారు అని అనుకుంటున్నారా? ఇన్ స్టాగ్రామ్ ఫొటోలు ఇక్కడైతే బాగా వస్తాయట. అందుకే ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు కేవలం ఫొటోలు దిగడానికే వస్తున్నారంట. ప్రత్యేకించి ఇన్ స్టాగ్రామ్ ఫొటోల కోసమే ఆస్ట్రేలియాలోని హాల్‌స్టట్ అనే గ్రామాన్ని పర్యాటకులు సందర్శిస్తున్నారు.

ఓ చిన్న లేక్ సమీపంలో ఈ కుగ్రామం ఉంది. గత కొన్నేళ్లుగా పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. రానురానూ టూరిస్టుల తాకిడితో ఈ గ్రామానికి పెద్ద సమస్యగా మారిపోయింది. దీన్ని ఎలా డీల్ చేయాలో తెలియక అక్కడి వారంతా తలలు పట్టేసుకుంటున్నారు. దీనిపై హాల్ స్టట్ మేయర్ అలెగ్జాండర్ షెడ్జ్ మాట్లాడుతూ.. ఈ టౌన్ లో టూరిస్టుల సంఖ్యను తగ్గించాలని భావిస్తున్నట్టు తెలిపారు. ‘సాంస్కృతిక చరిత్రలో హాల్ స్టట్ ముఖ్యమైన భాగం. ఇది మ్యూజియం కాదు కదా’ అని ఆయన అన్నారు.

కనీసం మూడో వంతు పర్యాటకులను తగ్గించాలని అనుకుంటున్నాం. టూరిస్టులను అడ్డుకోవడానికి మరో మార్గం లేదు’ అని తెలిపారు. ప్రపంచంలో ఇన్ స్టాగ్రామ్ ఫొటోలకు అత్యంత సుందరమైన పట్టణాల్లో హాల్ స్టట్ గ్రామం ఒకటి. వాషింగ్టన్ పోస్టు ప్రకారం.. 2018లో ఈ గ్రామంలో కేవలం 800 మంది మాత్రమే జనాభా ఉన్నప్పటికీ.. ఇన్ స్టాగ్రామ్ ఫొటోల కోసం ఇక్కడికి ఒక మిలియన్ మంది టూరిస్టులు సందర్శించినట్టు తెలిపింది. 1997లో ఈ గ్రామానికి UNESCO వరల్డ్ హెరిటేజ్ సైట్ టైటిల్ కూడా ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు