Python Bitten Old Man Min
Python Bitten : ఆస్ట్రేలియాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గ్రాజ్ లో 65ఏళ్ల వృద్ధుడికి చేదు అనుభవం ఎదురైంది. అతడి మర్మాంగాన్ని కొండచిలువ కొరికింది. బాత్రూమ్ కి వెళ్లి టాయిలెట్ సీటు మీద కూర్చునే సరికి అతడి మర్మాంగాన్ని ఏదో కరిచింది.
వెంటనే అతడు కిందకు చూశాడు. అంతే షాక్ తిన్నాడు. అక్కడ అతడికి కొండచిలువ కనిపించింది. అయితే అది విషపూరితం కాకపోవడంతో స్వల్పగాయాలతో వృద్ధుడు బతికిపోయాడు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ కొండచిలువ వృద్ధుడు పక్కింటి వ్యక్తిదిగా పోలీసులు గుర్తించారు. డ్రైనేజీ ద్వారా కొండచిలువ టాయ్ లెట్ లోకి వచ్చినట్లు అనుమానిస్తున్నారు.
కొండచిలువు 1.6మీటర్ల పొడవుంది. వృద్ధుడు తెల్లవారుజామున తన ఇంట్లోని టాయ్ లెట్ కి వెళ్లాడు. ఆ సమయంలో ఈ ఘటన జరిగింది. కొండచిలువ ఆల్బినో రెటికులేటడ్ జాతికి చెందినది. వృద్ధుడి పక్కింటి వ్యక్తి కొండచిలువను పెంచుకుంటున్నాడు. అతడి ఇంటి నుంచి తప్పించుకుని వచ్చింది. అది ఎలా తప్పించుకుంది? టాయ్ లెట్ లోకి ఎలా వచ్చింది? అనేది తెలియాల్సి ఉంది.
పాములు పట్టే నిపుణుడికి వెంటనే సమాచారం ఇచ్చారు. అతడు వచ్చి కొండచిలువను పట్టుకున్నాడు. దాన్ని శుభ్రం చేసి తిరిగి దాని యజమానికి అప్పగించారు. పక్కింటి వ్యక్తి 11 పాములు(విషపూరితం కానివి) పెంచుకుంటున్నాడు. అతడి నిర్లక్ష్యం కారణంగా వృద్ధుడి గాయపడ్డాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఆ వ్యక్తిపై చర్యలు తీసుకుంటామన్నారు.