Baba Vanga 2026 Chilling Predictions: యుద్ధాలు, ప్రమాదాలు, ప్రకృతి వైపరిత్యాలు, ఇంకా..! అత్యంత భయానకంగా 2026? ఆందోళనకు గురి చేస్తున్న బాబా వంగా జోస్యం..!
ప్రతి ఏడాది బాబా వంగా అంచనాలు నిజమవుతూనే వస్తున్నాయి. దీంతో 2026 సంవత్సరం సమీపిస్తున్న కొద్దీ బాబా వంగా అంచనాలు అలజడి రేపుతున్నాయి.
Baba Vanga 2026 Chilling Predictions: బాబా వంగా.. పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పటివరకు ఆమె ఇచ్చిన అంచనాలు (ప్రిడిక్షన్స్) ఎన్నో నిజమయ్యాయి. బల్గేరియాకు చెందిన ఈ అంధ జ్యోతిష్యురాలు 1911లో జన్మించారు. 1996లో మరణించారు. అతి చిన్న వయసులోనే (12 ఏళ్లు) కంటి చూపుని కోల్పోయారు. ఆ తర్వాతే బాబా వంగాకు భవిష్యవాణి చెప్పే అసాధారణ శక్తి వచ్చిందని చెబుతారు. తన జీవిత కాలంలో ఆమె చెప్పిన అనేక అంచనాలు (ప్రకృతి వైపరిత్యాలు, యుద్ధాలు, అంటువ్యాధులు) తర్వాతి కాలంలో నిజమయ్యాయని నమ్ముతారు. కరోనా మహమ్మారి, గల్ఫ్ యుద్ధం, భూకంపాలు వంటి అనేక సంఘటనలు ఆమె మాటలకు దగ్గరగానే జరిగాయి.
బ్రిటన్ యువరాణి డయానా మృతి, 2001లో న్యూయార్క్ ట్విన్ టవర్స్ కూల్చివేత, 9/11 ముంబై ఉగ్రవాద దాడులు, రష్యా-యుక్రెయిన్ వివాదం ఇలా ఎన్నో విషయాల గురించి బాబా వంగా చెప్పిన జోస్యం ఫలిచింది. దాంతో ‘నోస్ట్రాడమస్ ఆఫ్ ది బాల్కన్స్’గా ఆమె గుర్తింపు పొందారు.
బాబా వంగా చనిపోయిన దశాబ్దాల తర్వాత కూడా.. ఆమె జ్యోతిష్యం అంచనాల గురించి నిరంతరం చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆమె చెప్పిన విషయాలు దాదాపు నిజమయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధం, సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం, కరోనా వైరస్, 9/11 దాడులు వంటి అనేక సంఘటన గురించి ఆమె చెప్పిన అంచనాలన్నీ నిజమయ్యాయి.
ప్రతి ఏడాది బాబా వంగా అంచనాలు నిజమవుతూనే వస్తున్నాయి. దీంతో 2026 సంవత్సరం సమీపిస్తున్న కొద్దీ బాబా వంగా అంచనాలు అలజడి రేపుతున్నాయి. ప్రపంచ యుద్ధం, ఏలియన్లతో (గ్రహాంతర జీవులతో) మొదటి పరిచయం, కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధిపత్యం, ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా బంగారం ఖరీదైనదిగా మారడం, అతి పెద్ద ప్రకృతి వైపరీత్యం సంభవించే అవకాశం వంటి భయానక విషయాలు కలిగున్నాయి. ప్రకృతి వైపరీత్యాల గురించి ఆమె అంచనాలతో పాటు మానవులు సృష్టించిన యంత్రాలు మానవులనే నాశనం చేస్తాయన్న మాటలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా చాలామంది ఉద్యోగులు రోడ్డున పడే అవకాశాలు ఉంటాయని ఆమె తన అంచనాల్లో పేర్కొన్నారు.
3వ ప్రపంచ యుద్ధం..!
అత్యంత భయానక అంచనాల్లో మూడవ ప్రపంచ యుద్ధం ఉంది. 2026లో చైనా-రష్యా-అమెరికా మధ్య ఉద్రిక్తత పెరిగి.. తైవాన్, మిడిల్ ఈస్ట్, దక్షిణ చైనా సముద్రంలో పెద్ద యుద్ధం ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ యుద్ధం భూ భాగాలను దాటి, ప్రపంచ స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరించారు.ప్రస్తుతం యుక్రెయిన్-రష్యా యుద్ధం, చైనా-తైవాన్ వివాదం ఆమె అంచనాలకు దగ్గరగా ఉన్నాయి.
2026 లో ఏలియన్ కాంటాక్ట్ (గ్రహాంతరవాసులతో ప్రత్యక్ష సంబంధాలు) జరుగుతుందని బాబా వంగా అంచనా వేశారు. భారీ స్పేస్‌క్రాఫ్ట్ భూమి వాతావరణంలోకి ప్రవేశించి మానవులతో మొదటి సంప్రదింపు జరుగుతుందని చెప్పారు.
ఇక, 2026లో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ప్రకృతి విపత్తులు గురించి అంచనా వేశారు. భారీ భూకంపాలు, అగ్నిపర్వతాల పేలుళ్లు, హీట్ వేవ్, క్లౌడ్ బరస్ట్ వంటి తీవ్ర వాతావరణ మార్పులు, దాదాపు 8 శాతం భూభాగాన్ని ప్రభావితం చేస్తాయని అంచనా వేశారు. ఈ విపత్తులు యుగాంతానికి సంకేతాలుగా చెప్పారు. ఇలా.. 2026లో జరగబోయే బాబా వంగా అంచనాలు ప్రజలను భయపెడుతున్నాయి.
Also Read: 2025లో సరికొత్త రికార్డులు సృష్టించిన బంగారం.. ధరలు పైపైకి..
