World Bank Shocks Taliban Over Ban On Girls Education
world bank shocks taliban over ban on girls education : బాలికల విద్య విషయంలో మరోసారి వారి నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారు తాలిబన్లు. బాలికల హైస్కూల్ విద్యకు అనుమతినిస్తున్నట్లు తాలిబన్లు చెప్పి మాట మార్చారు. బాలికలు విద్యను అభ్యసించేందుకు అనుమతించట్లేదని ప్రకటించారు. తాలిబన్లు విధించిన ఈ ఆంక్షలు వారికే చేటు తెచ్చిపెట్టాయి. బాలికల విద్యపై విధించిన నిషేధం విషయంలో ప్రపంచ బ్యాంకు తాలిబన్లకు షాక్ ఇచ్చింది.
Also read : Taliban : బాలికల హై స్కూల్ విద్య విషయంలో తాలిబన్లు షాకింగ్ నిర్ణయం
స్కూళ్లకు వెళ్లకుండా ఆడపిల్లలపై నిషేధం విధించిన తాలిబన్ ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంకు గట్టి షాకిచ్చింది. అఫ్ఘానిస్తాన్ రీకన్‌స్ట్రక్షన్ ట్రస్ట్ ఫండ్ (ఏఆర్‌టీఎఫ్) కింద ఆఫ్ఘన్ గడ్డపై చేపట్టాల్సిన 600 మిలియన్ డాలర్ల పనులను నిలిపివేసింది ప్రపంచ బ్యాంకు. అమెరికా బలగాలు అఫ్ఘాన్‌ను వీడిన తర్వాత తాలిబన్లు అధికారం చేపట్టిన విషయం తెలిసిందే.
దీంతో ప్రపంచ బ్యంకు సహా అన్ని అంతర్జాతీయ సంస్థలు అప్ఘాన్ ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులను ఫ్రీజ్ చేశాయి. కానీ వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో కీలకమైన ప్రాజెక్టులకు సపోర్ట్ ఇచ్చేందుకు ఐక్యరాజ్య సమితికి చెందిన పలువిభాగాలు ఏఆర్‌టీఎఫ్‌కు కొత్త రూపునిచ్చాయి.
అయితే ఈ ఏఆర్‌టీఎఫ్ ద్వారా మహిళలు, ఆడపిల్లలకు కూడా సమానంగా లబ్ది పొందాలనేది ప్రపంచ బ్యాంకు నిబంధన పెట్టింది. ఇటువంటి సమంయలో 7వ గ్రేడ్ నుంచి అమ్మాయిలను స్కూళ్లకు పంపించకూడదని తాలిబన్ ప్రభుత్వం బ్యాన్ చేయడంతో ప్రపంచ బ్యాంకు ఆగ్రహించినట్లుగా తెలుస్తోంది. నిబంధనలు పాటించలేదనే కారణంతో ఏఆర్‌టీఎఫ్ నిధులను మంజూరు చేయకుండా ఆపేసింది.
Also read : Talibans : గడ్డం లేకుండా ఆఫీసుకొస్తే ఉద్యోగం నుంచి తీసేస్తాం : అఫ్ఘాన్‌లో తాలిబన్లు హుకుం
ఆఫ్ఘన్‌లోని పరిస్థితులపై ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ భాగస్వాములు పూర్తి అవగాహనకు వచ్చిన తర్వాతనే ప్రాజెక్టులను ఏఆర్‌టీఎఫ్‌కు అందజేస్తామని అఫ్ఘాన్ ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంకు అధికారులు స్పష్టం చేశారు. బాలికల విద్యపై తాలిబన్లు నిషేధం విధించిన క్రమంలో.. దోహాలో తాలిబన్ నేతలతో మీటింగ్‌ను అమెరికా అధికారులు రద్దు చేసుకున్నారు.కానీ ఏప్రిల్ నుంచి బాలికలను స్కూళ్లలోకి అనుమతిస్తామని తాలిబన్ లీడర్లు చెప్పుకొస్తున్నారు. కానీ ఇది ఎంతవరకు దీన్ని అమలు చేస్తారో తెలియాల్సి ఉంది.