Taliban : బాలికల హై స్కూల్ విద్య విషయంలో తాలిబన్లు షాకింగ్ నిర్ణయం

గతంలో బాలికల హైస్కూల్ విద్యకు అనుమతినిస్తున్నట్లు తాలిబన్లు కొద్దిరోజుల క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే. వారి విద్యను అభ్యసించేందుకు అనుమతించట్లేదని ప్రకటించారు...

Taliban : బాలికల హై స్కూల్ విద్య విషయంలో తాలిబన్లు షాకింగ్ నిర్ణయం

Taliban

Taliban High Schools : అప్ఘానిస్తాన్ ను వశం చేసుకున్న తాలిబన్లు మరోసారి వార్తల్లో ఎక్కారు. బాలికల విద్య విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. వారి విషయంలో గతంలో ప్రకటించిన మాటను మార్చుకున్నారు. గతంలో బాలికల హైస్కూల్ విద్యకు అనుమతినిస్తున్నట్లు తాలిబన్లు కొద్దిరోజుల క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే. వారి విద్యను అభ్యసించేందుకు అనుమతించట్లేదని ప్రకటించారు. ఈ సంవత్సరం ఇప్పటికే స్కూల్స్ ప్రారంభమయ్యాయి. కూడా ఇప్పుడు తాలిబన్లు తీసుకున్న నిర్ణయంతో మరోసారి హై స్కూల్స్ మూతపడనున్నాయి. తమ ప్రభుత్వాన్ని గుర్తించేందుకు వీలుగా సంస్కరణలు చేపడుతున్నట్లు వారు వెల్లడించడం గమనార్హం. ఇప్పడు తీసుకున్న నిర్ణయంతో చాలా మంది బాలికలు చదువుకు దూరం కానున్నారు. బాలికలకు ఉన్నత విద్య అభ్యసించేందుకు అనుమతించడం లేదని, ఆరో తరగతి వరకు మాత్రమే పరిమితం చేస్తున్నట్లు గతంలో చెప్పారు.

Read More : India – Taliban: భద్రత కల్పిస్తాం.. రాయబార కార్యాలయం తెరవండి: భారత్ కు తాలిబన్ల విజ్ఞప్తి

తీసుకున్న నిర్ణయానికి గ్రామీణ ప్రజలేనని తాలిబన్లు వెల్లడిస్తున్నారు. గ్రామీణ ప్రాంత, గిరిజన ప్రాంతాల్లో ఉన్న వారు వారి వారి పిల్లలను స్కూల్స్ కు పంపించడానికి ఆసక్తి చూపడం లేదని వారు వెల్లడిస్తున్నారు. బాలికలకు ఉన్నత విద్యను నిషేధించడం జరుగుతోందని పేర్కొన్నారు. తాలిబన్లచే దురాక్రమణకు గురై..ఆందోళనకర స్థాయిలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్నాయని విమర్శలు చెలరేగుతున్నాయి. అఫ్గాన్ లో బాలికలను చదువుకునేందుకు అనుమతించాలంటూ అంతర్జాతీయ సమాజాల నుంచి వస్తున్న ఒత్తిడి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం లేదు. ఇప్పటికే మహిళల విషయంలో తాలిబన్లు కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. మహిళలు 72కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తే వారు సన్నిహితులైన కుటుంబ సభ్యుల తోడు తీసుకోవాల్సిందే అని సాదెఖ్ అకీఫ్ ముహజీర్ వెల్లడించారు.