India – Taliban: భద్రత కల్పిస్తాం.. రాయబార కార్యాలయం తెరవండి: భారత్ కు తాలిబన్ల విజ్ఞప్తి

తాలిబన్ల అస్థిత్వాన్ని గుర్తించేలా తమ దేశంలో రాయబార కార్యాలయాన్ని తిరిగి ప్రారంభించాలని అఫ్గానిస్తాన్ లోని తాలిబన్ నేతలు భారత్ ను విజ్ఞప్తి చేశారు.

India – Taliban: భద్రత కల్పిస్తాం.. రాయబార కార్యాలయం తెరవండి: భారత్ కు తాలిబన్ల విజ్ఞప్తి

Talibans

India – Taliban: భారత్ తో ద్వైపాక్షిక సంబంధాలు పెంపొందించి దౌత్యపరమైన తాలిబన్ల అస్థిత్వాన్ని గుర్తించేలా తమ దేశంలో రాయబార కార్యాలయాన్ని తిరిగి ప్రారంభించాలని అఫ్గానిస్తాన్ లోని తాలిబన్ నేతలు భారత్ ను విజ్ఞప్తి చేశారు. అఫ్గాన్ రాజధాని కాబుల్ లో భారత రాయబార కార్యాలయాన్ని తిరిగి తెరిపిస్తే భద్రత కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని తాలిబాన్ నేతలు భారత్ కు తెలియజేసినట్లు వార్తా సంస్థ టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. తాలిబన్ UN రాయబారి సుహైల్ షాహీన్..మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ దేశాలు తమ ఉనికిని గుర్తించేలా అఫ్గాన్ లో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలిపాడు.

Also Read: Russia-Ukraine War:‘మీరు టిక్ టాక్ స్టార్ కదా’..యుక్రెయిన్ అధ్యక్షుడిని ప్రశ్నించిన యువతి..జెలెన్ స్కీ ఏమన్నారోతెలుసా?!

ఇటీవల మానవతా సహాయం కింద భారత్ పంపిన 50 వేల మెట్రిక్ టన్నుల గోధుమలను తాలిబన్లు స్వీకరించి, భారత్ కు కృతఙ్ఞతలు తెలిపిన నేపథ్యంలో వారు తిరిగి ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆహార సంక్షోభంలో చిక్కుకున్న అఫ్గానిస్తాన్ ను ఆదుకునేందుకు ముందుకొచ్చిన భారత్ విడతల వారీగా సహాయం అందించింది. అందులో భాగంగా చివరగా 50 వేల టన్నుల గోధుమలను తాలిబన్లకు చేరవేసింది భారత్. అదే సమయంలో పాకిస్తాన్ సైతం తాలిబన్లకు గోధుమలు పంపించింది. అయితే పాకిస్తాన్ పంపిన గోధుమల గురించి ఫిర్యా దు చేస్తూ తాలిబాన్ నేతలు పాకిస్తాన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ఇచ్చిన గోధుమలు కొన్ని పుచ్చిపోయాయని తాలిబాన్ నాయకులు పేర్కొన్నారు. పాక్ ఇచ్చిన ‘నాణ్యత లేని’ గోధుమలను పారేయడానికి తప్ప ఎందుకు పనికిరావని వారు పేర్కొన్నారు. అదే సమయంలో భారత్ ఇచ్చిన గోధుమలు ఎంతో నాణ్యంగా ఉన్నాయని పాకిస్తాన్ అందించే సహాయంతో పోలిస్తే భారత సహాయం చాలా గొప్పదని తాలిబన్ లు పేర్కొన్నారు. గోధుమల సరఫరా సమయంలో అట్టారీ-వాఘా సరిహద్దు వద్ద రవాణా వాహనాలను పాకిస్తాన్ నిలిపివేయడం ద్వారా దేశంలోకి ప్రవహించే మానవతా సహాయాన్ని నిలిపివేసినందుకు పాకిస్థాన్ పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Also Read: US : 13 ఏళ్ల పిల్లాడి దూకుడు..బాలుడు, తండ్రితో సహా తొమ్మిదిమంది మృతి

అఫ్గాన్ ను తాలిబన్లు చేజిక్కించుకున్న అనంతరం ఆగస్టు 2021లో కాబూల్లో ఏర్పాటు చేసిన తాలిబాన్ ప్రభుత్వాన్ని భారతదేశం గుర్తించలేదు. ప్రాథమిక మానవ హక్కులు, ప్రత్యేకించి మహిళలందరికీ విద్యా హక్కు , ప్రభుత్వంలో వైవిధ్యం మరియు మైనారిటీల రక్షణపై తాలిబాన్ నిబద్ధతద్ధ గురించి మిగతా ప్రపంచ దేశాలతో పాటు భారత్ కూడా ప్రశ్నించింది. అయితే తాలిబన్ దురాక్రమణ అనంతరం చైనా సహా ఇతర ఇస్లామిక్ దేశాలు కూడా తాలిబన్లకు సహాయంగానీ మద్దతుగానీ ప్రకటించలేదు.

Also Read: Russian Missiles : యుక్రెయిన్‌లో ఎయిర్‌క్రాఫ్ట్ రిపేర్ ప్లాంట్‌పై రష్యా క్షిపణుల దాడి..!