Talibans : గ‌డ్డం లేకుండా ఆఫీసుకొస్తే ఉద్యోగం నుంచి తీసేస్తాం : అఫ్ఘాన్‌లో తాలిబన్లు హుకుం

గ‌డ్డం లేకుండా ఆఫీసుకొస్తే ఉద్యోగం నుంచి తీసేస్తాం అంటూ అఫ్ఘాన్‌లో తాలిబన్లు ఉద్యోగులకు సరికొత్త హుకుం జారీ చేశారు.

Talibans : గ‌డ్డం లేకుండా ఆఫీసుకొస్తే ఉద్యోగం నుంచి తీసేస్తాం : అఫ్ఘాన్‌లో తాలిబన్లు హుకుం

Taliban Government New Rules To Afghan Employees

taliban government new rules to afghan employees : అప్ఘానిస్థాన్ ను స్వాధీనం చేసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటినుంచి తాము మారిపోయామని..ప్రజల సంక్షేమ పాలన చేస్తామని కల్లబొల్లి మాటలు చెబుతున్న తాలిమన్లు మళ్లీ మళ్లీ తమ బుద్ధిని బయటపెట్టుకుంటున్నారు. కొత్త కొత్త రూల్స్ పాస్ చేస్తు ప్రజల్ని నానా ఇబ్బంలు పెడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సరికొత్త రూల్స్ పెడుతు తాలిబన్ల మార్క్ పాలన ఏంటో చూపిస్తున్నారు. ఈ క్రమంలో అఫ్ఘాన్ లో తాలిబన్ ప్రభుత్వం మరో కొత్త రూల్ పాస్ చేసింది. అదేమంటే ‘ప్రభుత్వ ఉద్యోగులు గడ్డాలు లేకుండా ఆఫీసుకు రావొద్దు అని ఒకవేళ ఈ నిబంధన అతిక్రమించి గడ్డం లేకుండా ఆఫీసుకు వస్తే వారిని ఉద్యోగంనుంచి తీసివేస్తాం ’అని వార్నింగ్ ఇచ్చారు.

Also read :  Taliban : బాలికల హై స్కూల్ విద్య విషయంలో తాలిబన్లు షాకింగ్ నిర్ణయం

అఫ్ఘాన్ రాజధాని కాబూల్‌లో ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌ల్లో తాలిబన్లు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవ్వరు గడ్డం గీసుకోవద్దు అని హుకుం జారీ చేశారు. అంతేకాదు ఉద్యోగులు అంతా సంప్ర‌దాయ దుస్తుల‌నే ధ‌రించాల‌ని ఆదేశించారు. ఇప్పటికే బాలిక‌ల విద్య‌ను ర‌ద్దు చేసిన తాలిబన్లు.. తాజాగా పురుషుల‌పైనా కొత్త నిబంధ‌న‌లు విధిస్తు ‘గడ్డం తప్పనిసరి’ చేస్తు హుకుం జారీ చేశారు. ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో ప‌నిచేసే పురుషులు గ‌డ్డం లేక‌పోతే డ్యూటీలకు రావద్దు అంటు కొత్త రూల్ ప్ర‌వేశ‌పెట్టారు. ప్ర‌భుత్వ ఉద్యోగులైనప్ప‌టికీ పురుషుల‌కు గ‌డ్డం ఉండాల్సిందేన‌ని తేల్చిచెబుతున్న తాలిబన్లు.. గ‌డ్డం లేక‌పోతే వారిని ఉద్యోగాల్లో నుంచి తీసివేయటానికి కూడా వెనుకాడేది లేద‌ని తేల్చిచెప్పారు. అలాగే పొడవాటి, వదులుగా ఉండే టాప్,ప్యాంటు,టోపీ లేదా తలపాగాతో కూడిన స్థానిక దుస్తులను ధరించాలని ఆర్డర్ వేశారు.

రాజ‌ధాని కాబూల్‌లోని ప‌లు ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌ను తాలిబన్ ప్ర‌భుత్వంలోని ప‌బ్లిక్ మొరాలిటీ మంత్రిత్వ శాఖ‌కు చెందిన అధికారులు సోమ‌వారం (మార్చి 28,2022)త‌నిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఉద్యోగుల‌కు డ్రెస్ కోడ్ త‌ప్ప‌నిస‌రి అని ప్ర‌క‌టించారు. గడ్డం గీసుకోవ‌ద్ద‌ని చెప్పిన అధికారులు.. సంప్ర‌దాయ దుస్తుల‌నే ధ‌రించాల‌ని హుకుం జారీ చేశారు.

Read More : India – Taliban: భద్రత కల్పిస్తాం.. రాయబార కార్యాలయం తెరవండి: భారత్ కు తాలిబన్ల విజ్ఞప్తి

అంతేకాదు గత కొన్ని రోజుల క్రితం తాలిబన్లు మహిళలు పురుషులు కలిసి పార్కులకు వెళ్లకూడదని వేరు వేరుగా పార్కులకు వెళ్లాలని హకుం జారీ చేశారు.మహిళలు వారానికి మూడు రోజులు, అదే మగవాళ్లు వారం ఆఖరిలో నాలుగు రోజులు పార్కులకు వెళ్లాలని ఇద్దరు కలిసి పార్కులకు వెళ్లకూడదని వారి వివాహితులు అయినాసరే మహిళలు, పురుషులు కలిసి పార్కులకు వెళ్లకూడదని కూడా రూల్ పాస్ చేశారు.