Fresh Covishield Doses : కోవిషీల్డ్ మొదటి డోసులను తాత్కాలికంగా నిలిపివేసిన బంగ్లాదేశ్

సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి అందుకున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి మోతాదులను బంగ్లాదేశ్ తాత్కాలికంగా నిలివేసింది.

Fresh Covishield Doses : కోవిషీల్డ్ మొదటి డోసులను తాత్కాలికంగా నిలిపివేసిన బంగ్లాదేశ్

Bangladesh To Temporarily Suspend Fresh Covishield Doses

Updated On : April 26, 2021 / 11:59 AM IST

Bangladesh temporarily suspend Covishield doses : సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి అందుకున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి మోతాదులను బంగ్లాదేశ్ తాత్కాలికంగా నిలివేసింది. భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ.. టీకా నిరంతర సరఫరాపై ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ ఎబిఎం ఖుర్షెడ్ ఆలం ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే మొదటి మోతాదును పొందినవారికి మాత్రమే తదుపరి డోసు అనుమతి ఉంటుంది.



బంగ్లాదేశ్ 2 మిలియన్ కోవిషీల్డ్ మోతాదుల కోసం ఎదురుచూస్తోంది. కానీ కోవిషీల్డ్ డోసులను స్వీకరించకపోవడంతో బంగ్లాదేశ్ తాజా రౌండ్లు ప్రారంభించలేదు. ఇప్పటికే సీరంకు 2 మిలియన్ మోతాదులకు చెల్లించినప్పటికీ.. డోసులను అందుకోలేదు. బంగ్లాదేశ్ ఈ టీకాను సీరం నుంచి కొనుగోలు చేసినట్లు విదేశాంగ మంత్రి ఎకె అబ్దుల్ మోమెన్ చెప్పారు. పెరుగుతున్న కేసుల దృష్ట్యా బంగ్లాదేశ్ మొదటి వ్యాక్సిన్ డోసులను ప్రారంభించకపోవడం ఆందోళన కలిగించింది.



వారాంతంలో బంగ్లాదేశ్ 101 మరణాలు నమోదయ్యాయి. కరోనాతో 11,000 మంది మరణించారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ కొరత సరిగ్గా ఒక ఏడాది తరువాత భారతదేశం తన వైద్య దౌత్యానికి నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులు వంటి చిన్న దక్షిణాసియా పొరుగు దేశాలను లక్ష్యంగా చేసుకుంది. వ్యాక్సిన్ల కొరతను పరిష్కరించడానికి, బంగ్లాదేశ్ కనీసం 6 లక్షల మోతాదుల COVID-19 వ్యాక్సిన్లను చైనా నుంచి స్వీకరిస్తుందని గత వారమే మిస్టర్ మోమెన్ ప్రకటించారు.

దేశీయ వినియోగం కోసం స్పుత్నిక్ V టీకా సహ ఉత్పత్తి చేయడానికి మాస్కోతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. స్పుత్నిక్ వ్యాక్సిన్ మోతాదులో కొంత మొత్తం ముందస్తుగా చెల్లిస్తామని తెలిపారు. మిగిలిన మోతాదులను ఒప్పందం ప్రకారం తయారుచేసుకోవచ్చునని పేర్కొన్నారు.