22 అంతస్తుల బిల్డింగ్ ను క్షణాల్లో కూల్చేశారో చూడండీ..

ఒక ఇల్లు కట్టాలంటే తక్కువలో తక్కువ ఆరేడు నెలలైనా పడుతుంది. దాన్ని కూల్చాలంటే కనీసం రెండు మూడు రోజులైనా పడుతుంది. కానీ 22 అంతస్తుల బిల్డింగ్ ను క్షణాల్లో కూల్చేసిన దృశ్యం చూస్తే ఆశ్చర్యపోక కలుగుతుంది. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ఏదీ అసాధ్యం అనే మాటే లేకుండా పోతోంది. ఈ 22 అంతస్తుల భారీ బిల్డింగ్ ను కేవలం సెకన్లలో కూల్చివేయటానికి అధికారులు అత్యంత అధునాత టెక్నాలజీని వాడారు.
ఆదివారం (నవంబర్ 24)న సౌతాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో 22 అంతస్తుల భారీ బిల్డింగ్ ను సెకన్లలో కూల్చేశారు. 22 అంతస్తుల బ్యాంక్ ఆఫ్ లిస్బన్ బిల్డింగ్ లో 2019 సెప్టెంబర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో ఆ బిల్డింగ్ పూర్తిగా దెబ్బతింది. అనంతరం బిల్డింగ్ ను అధికారులు పరిశీలించి..నిర్మాణ లోపం ఉందని దృవీకరించారు. పైగా అగ్నిప్రమాదం జరగడం..నిర్మాణ లోపం ఉండడంతో దాన్ని కూల్చేయటం తప్పదని చెప్పటంతో ఆదివారం కూల్చేశారు.
దీంట్లో భాగంగా..ఎవ్వరికీ ఎటువంటి ప్రమాదం జరగకూడదనే ఉద్ధేశ్యంతో ముందు జాగ్రత్తగా..చుట్టుపక్కల ఉన్న భవనాల్లోని 2 వేల మందిని ఖాళీ చేయించారు. మొత్తానికి భవనాన్ని విజయవంతంగా కూల్చివేశారు. ఈ బిల్డింగ్ కూల్చివేతకు 894 కిలోల పేలుడు పదార్థాలు వాడారు. కాగా..ఈ బిల్డింగ్ లో అగ్ని ప్రమాదంలో మంటల్ని అర్పేందుకు వచ్చిన ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు.
The demolition of the Bank of Lisbon building in Johannesburg CBD this morning. M.M pic.twitter.com/IWGfQcgPkR
— Jozi FM (@jozifm) November 24, 2019