సిడ్నీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

  • Publish Date - October 1, 2019 / 04:15 AM IST

తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కేవలం మన తెలంగాణ రాష్ట్రంలోనే కాదు.. సిడ్నీలో కూడా బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరుపనున్నారు. ఈ నెల (అక్టోబర్ 5, 2019)న మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సిడ్నీ నగరంలోని దుర్గా దేవాలయం వద్ద బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు సిడ్నీ బతుకమ్మ, దసరా ఉత్సవాల చైర్మన్ అనిల్ మునగాల తెలిపారు.

తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ‘బ‌తుక‌మ్మ బ‌తుక‌మ్మ ఉయ్యాలో.. బంగారు బతుక‌మ్మ ఉయ్యాలో’ అంటూ… ఉయ్యాల పాట‌లు పాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలను నిర్వహిస్తున్నారు.

అంతేకాదు ఈ వేడుకల్లో కోలాటం, ప్రత్యేక దాండియా షో, జమ్మి పూజ, శివ గర్జన డ్రమ్స్, బతుకమ్మ స్పెషల్ లేజర్ షో, స్పెషల్ ఫోక్ బ్యాండ్‌తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. గాయకుడు మిట్టపల్లి సురేందర్, గాయని వొల్లాల వాణి బతుకమ్మ వేడుకల్లో ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొననున్నారు. ఇక అందంగా కొలువైన బతుకమ్మలకు ప్రత్యేక బహుమతులు కూడా అందజేయనున్నారు.