హార్ట్ టచ్చింగ్ వీడియో : ప్రాణం కాపాడిన వ్యక్తిపై పిల్ల ఎలుగుబంటి ప్రేమ : కాళ్లు పట్టుకుని..

  • Published By: veegamteam ,Published On : January 3, 2020 / 10:22 AM IST
హార్ట్ టచ్చింగ్ వీడియో : ప్రాణం కాపాడిన వ్యక్తిపై పిల్ల ఎలుగుబంటి ప్రేమ : కాళ్లు పట్టుకుని..

Updated On : January 3, 2020 / 10:22 AM IST

అగ్నిప్రమాదంలో చిక్కుకున్న ఓ ఎలుగుబంటి పిల్లను ఓ యువకుడు కాపాడాడు. దీంతో ఆ యువకుడిని యువకుడిని వదల్లేకపోయింది ఎలుగుబంటి. కాసేపు ఆ వ్యక్తి కాళ్లను పట్టుకుని అలాగే ఉండిపోయింది. అతను కూడా కాసేపు ఆ ఎలుగుబంటి పిల్లతో ఆటలాడాడు. తరువాత అతను వెళ్లిపోతుంటే కూడా పరుగెత్తింది..నిన్ను మరచిపోలేని మిత్రమా.. అన్నట్లుగా అతని కాళ్లు పట్టుకుని ఆ ఎలుగు బంటి కాసేపు అలాగే ఉండిపోయిన  ఈ దృశ్యాలు అందరి మనస్సుల్ని హత్తుకున్నాయి. ఈ హార్ట్ టచ్చింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఈ దృశ్యాలను చిత్రీకరించిన జూలీ మేరియా కాప్పిలో అనే వ్యక్తి తన ట్విట్టర్‌ పేజీలో పోస్టు చేశాడు. ఈ వీడియో వైరల్‌ కాగా, ట్విట్టర్‌ పేజీలో 66 వేల మంది వీక్షించగా, 5,400 మంది లైక్‌ చేశారు. 1200 మంది రీట్వీట్‌ చేశారు.