Beijing Covid-19 : చైనాలో కరోనా డేంజర్ బెల్స్.. బీజింగ్‌లో మిలియన్ల మందికి కొవిడ్ పరీక్షలు..!

Beijing Covid-19 : చైనాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసుల తీవ్రత పెరిగిపోతోంది. చైనాలోని ప్రధాన నగరాల్లో కరోనా డేంజర్ బెల్స్ ప్రజల్లో భయాందోళనలకు గురిచేస్తున్నాయి.

Beijing Covid-19 : చైనాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసుల తీవ్రత పెరిగిపోతోంది. చైనాలోని ప్రధాన నగరాల్లో కరోనా డేంజర్ బెల్స్ ప్రజల్లో భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా జీరో కోవిడ్ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని భావిస్తోంది. అందులో భాగంగానే బీజింగ్ సిటీలో 21 మిలియన్ల మంది ప్రజలకు సామూహిక కరోనా పరీక్షలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు ప్రకటించారు. కరోనా వ్యాప్తితో షాంఘై తరహా లాక్‌డౌన్ విధిస్తారనే ఆందోళన వ్యక్తమవుతోంది. దాంతో అక్కడి ప్రజలంతా ముందుజాగ్రత్తగా తమ ఆహారాన్ని స్టోర్ చేసుకుంటున్నారు.

చైనా రాజధానిలోని 16 జిల్లాలలో ముందుగా కరోనా టెస్టులను ప్రారంభించింది.. ఈ ప్రాంతాల్లో చాలావరకు కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల తీవ్రత అధికంగా ఉన్న నగర ప్రాంతాల్లో కొన్నిచోట్ల లాక్‌డౌన్‌లను విధించారు. షాంషైకు ఐదు బయటి జిల్లాలు మినహా అన్నింటి జిల్లాల్లో కరోనా పరీక్షలను మంగళవారం (ఏప్రిల్ 26) నిర్వహించనున్నట్టు ఆరోగ్య అధికారులు వెల్లడించారు. బీజింగ్‌లో కరోనా కేసులు పెరిగినప్పటినుంచి కేవలం 70 కేసులు మాత్రమే గుర్తించారు. కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి చైనా ‘జీరో-కోవిడ్’ విధానంలో కఠినమైన చర్యలను అధికారులు చేపట్టారు.

Beijing To Mass Test Most Of City As Covid 19 Cases Mount (1)

1.4 బిలియన్ల జనాభా కలిగిన దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితుల్లో సెంట్రల్ చైనాలోని అన్యాంగ్ సిటీ ఉత్తర కొరియా సరిహద్దులో ఉన్న దండోంగ్ లాక్‌డౌన్‌లను విధించారు. దాదాపు రెండు వారాలకు పైగా షాంఘై లాక్ డౌన్ లోకి వెళ్లింది. గత 24 గంటల వ్యవధిలో చైనాలో 19వేల కన్నా ఎక్కువగా కొత్త కేసులు నమోదు కాగా.. 51 కరోనా మరణాలు నమోదయ్యాయి. తద్వారా కరోనా మరణాల సంఖ్య 138కి పెరిగింది.

గత 24 గంటల్లో సాయంత్రం 4 గంటల నుంచి 29 కొత్త కేసులు గుర్తించినట్లు బీజింగ్ ఆరోగ్య అధికారులు తెలిపారు . సోమవారం నుంచి శుక్రవారానికి మొత్తంగా 70కి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే 46 కేసులు నమోదైన చాయోయాంగ్ జిల్లా అంతటా కరోనామాస్ టెస్టులను నిర్వహించాలని అధికారులు ఆదేశించారు. చాయాంగ్‌లోని 3.5 మిలియన్ల నివాసితులు, జిల్లాలో పనిచేసే వ్యక్తులు సోమ, బుధ శుక్రవారాల్లో పరీక్షలను తప్పక చేయించుకోవాలని అధికారులు ఆదేశించారు.

Read Also : China Coronavirus: వణుకుతున్న చైనా.. ఒకేరోజు 56మంది మృతి..

ట్రెండింగ్ వార్తలు