Alexander Lukashenko: విష ప్రయోగం..? రష్యా అధ్యక్షుడితో రహస్యంగా సమావేశమైన బెలారస్ అధ్యక్షుడికి తీవ్ర అస్వస్థత

సెంట్రల్ క్లినికల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు బెలారస్ ప్రతిపక్ష నేత, బెలారస్ 2020 అధ్యక్ష అభ్యర్థి వాలెరీ త్సెప్కాలో అన్నారు.

Alexander Lukashenko – Russia: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌(Vladimir Putin)తో మాస్కోలో సమావేశమైన వెంటనే బెలారస్ అధ్యక్షుడు (Belarusian President) అలెగ్జాండర్ లుకాషెంకో తీవ్ర అస్వస్థతకు గురి కావడం కలకలం రేపుతోంది. లుకాషెంకోను మాస్కోలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సెంట్రల్ క్లినికల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు బెలారస్ ప్రతిపక్ష నేత, బెలారస్ 2020 అధ్యక్ష అభ్యర్థి వాలెరీ త్సెప్కాలో (Valery Tsepkalo) అన్నారు. తన టీమ్ కు ఈ మేరకు సమాచారం అందిందని, మరింత సమాచారం కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

పుతిన్ తో అలెగ్జాండర్ లుకాషెంకో రహస్యంగా సమావేశమయ్యారని ఆయన ఆరోపించారు. ఆ తర్వాతే హుటాహుటిన లుకాషెంకోను ఆసుపత్రికి తరలించారని వివరించారు. అలెగ్జాండర్ లుకాషెంకోను రక్షించుకునేందుకు వ్యవస్థీకృతంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయనకు పాయిజన్ ఇచ్చారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వాలెరీ త్సెప్కాలో తెలిపారు. లుకాషెంకో ఆరోగ్యంపై కొన్ని రోజులుగా వదంతులు వ్యాపిస్తున్నాయి.

Sengol: రాజదండం వెనుక రాజకీయ అడుగులు.. మోదీ పొలిటికల్ స్కెచ్.. అందుకేనా?

ట్రెండింగ్ వార్తలు