డోనాల్డ్ ట్రంప్ ఏంటో, బైడెన్‌కు ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది

Biden vs Trump: US presidential election 2020: జగడాల మారి ట్రంప్, దూసుకొస్తోన్న బైడెన్. ప్రపంచం మొత్తం ఎన్నికల ఫలితాలకోసం ఇంట్రెస్ట్ చూపిస్తున్నవేళ, ఈ ఇద్దరూ తొలిసారిగా ముఖాముఖీ తలపడబోతున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారం ఓ రేంజ్‌కి చేరింది. బుధవారం ప్రెసిడెన్షియల్ డిబేట్‌తో మరో గేర్ మార్చం ఖాయం. దీంతో ట్రంప్, జో బైడెన్‌లో ఎవరు సత్తా చాటుతారనేది ఆసక్తికరం. ఓ వైపు Trump తన సూటిపోటి మాటలతో వ్యక్తిగత దాడికి దిగితే, Joe Biden మాత్రం జాతీయ సర్వేల్లో ఆధిపత్యం సాధించిన ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు
ట్రంప్ జెంటిల్‌మేన్‌లా ప్రవర్తిస్తారని ఎవరూ అనుకోరు. దానికి తగ్గట్టుగా అసలు Joe Biden వ్యవహారశైలిపై తనకి అనుమానం ఉందని, ఆయనకి డ్రగ్స్ టెస్ట్ చేయించాలంటూ నోరు పారేసుకున్నారు.
దీంతో ఒక్కసారిగా హీట్ పెరిగిపోయింది..అసలు అమెరికా అధ్యక్ష పదవికి రెండోసారి పోటీ పడుతోన్న ట్రంప్..తనకి ఉన్న అవకాశాలన్నీ వాడుకుంటారనుకున్నారు.
ట్రంప్ నైజం బైటపడింది
ఇలా ఓ అధ్యక్ష అభ్యర్ధిపై ఏకంగా డ్రగ్స్ పుచ్చుకుంటున్నారనే ఆరోపణలు గుప్పించడం కలకలం రేపుతోంది, దానికి తోడు ట్రంప్ సుప్రీంకోర్టు జడ్జిల నియామకంలోనూ తన మార్క్ వేశారు. అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అమీ కోనే బారెట్‌ను నామినేట్ చేశారు. న్యాయవ్యవస్థలో రిపబ్లికన్ల హవా పెంచుకోవడం కోసం ట్రంప్ ఆమెను నామినేట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.
సహజంగానే, జో బైడెన్ దీన్ని తీవ్రంగా తప్పుబట్టారు..ఎన్నికలు సాగుతుండగానే ఇలా చేయడం సరికాదని..ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టంటూ ఆరోపించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత వారంలోనే ఎన్నికల ఫలితాల తర్వాత అధికార మార్పిడిని అంత ఈజీగా చేయడానికి సిద్ధంగా లేనట్లు సంకేతాలు ఇచ్చారు. కోర్టు ద్వారా అయినా తన పంతం నెగ్గించుకుంటాననే లీకులు ఇవ్వగా, ఇప్పుడు అమీ కోనే బారెట్‌ను కోర్టులో నామినేట్ చేశారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయ్.
జో బైడన్‌కు ఎడ్వాంటేజ్
మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా 36 రోజుల సమయమే ఉంది. అందుకే అమెరికాలో రెండు ప్రతిష్టాత్మక సంస్థలు.. తమ సర్వే ఫలితాలను వెల్లడించాయి. ఎక్కువ మంది అమెరికన్లు డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌కే జై కొట్టినట్టు వివరించాయి. వాషింగ్టన్ పోస్ట్, ఏబీసీ న్యూస్ నిర్వహించిన నేషనల్ సర్వేలో 10 శాతం పాయింట్లతో జో బైడెన్.. డొనాల్డ్ ట్రంప్ కంటే ముందంజలో ఉన్నట్లు సర్వే ఫలితాలు స్పష్టం చేశాయి.
జో బైడెన్, కమలా హారిస్‌కు 54 శాతం మంది అమెరికన్లు మద్దతు తెలిపిదే.. డొనాల్డ్ ట్రంప్, మైక్ పెన్స్‌కు 44శాతం మంది మాత్రమే బాసటగా నిలిచారని వాషింగ్టన్ పోస్ట్ పోల్స్‌లో వెల్లడైంది. న్యూయార్క్ టైమ్స్, సియానా కాలేజ్ చేసిన మరో సర్వేలో కూడా డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్, ఎనిమిది పాయింట్లతో ట్రంప్ కంటే ముందున్నారని తేలింది.
ఈ నేపథ్యంలోనే బుధవారం జరిగే ఫస్ట్ ప్రెసిడెన్షియల్ డిబేట్ హాట్ హాట్‌గా సాగవచ్చనే అంచనాలు నెలకొన్నాయ్..