అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో బైడెన్ సరికొత్త రికార్డు

Joe Biden wins more votes than any other presidential candidate in US history అమెరికా ఎన్నికల చరిత్రలో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ సరికొత్త రికార్డును నమోదు చేశారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను దాటి అమెరికా చరిత్రలో అత్యధిక పాపులర్ ఓట్లు పొందిన అభ్యర్థిగా నిలిచారు. ఇప్పటివరకు ఆయనకు 7.07 కోట్ల ఓట్లు లభించాయి.



కాగా, 2008లో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు అత్యధికంగా 6.94 కోట్ల ఓట్లు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుత అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో దూసుకుపోతున్న జో బైడెన్ ఒబామా పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టారు. ఓట్ల లెక్కింపు ఇంకా జరుగుతున్న నేపథ్యంలో బైడెన్​కు మరిన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది.



https://10tv.in/obama-mocks-trump-for-walking-out-of-60-minutes-interview-as-he-rallies-biden-supporters-in-miami/
మరోవైపు, రిపబ్లికన్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఒబామా రికార్డుకు చేరువలో ఉన్నారు. ఇప్పటివరకు 6.73 కోట్ల పాపులర్ ఓట్లు ట్రంప్ ​కు లభించాయి. అయితే, అమెరికాలో వందేళ్లలో ఈసారి అత్యధిక పోలింగ్‌ నమోదైన విషయం తెలిసిందే.



అయితే, ఉత్కంఠగా సాగుతోన్న అమెరికా ఎన్నికల ఓట్ల లెక్కింపులో జో బైడెన్‌ ఆధిక్యం దిశగా వెళుతున్నారు. శ్వేతసౌధానికి ఆరు ఎలక్టోరల్​ ఓట్ల దూరంలో బైడెన్​ ఉన్నారు. అధ్యక్ష పీఠంపై కూర్చునేందుకు అవసరమైన 270 ఎలక్టోరల్​ ఓట్లకు గాను బైడెన్ ఇప్పటికే​ 264 ఓట్లు సాధించారు. ట్రంప్‌కు 214 ఓట్లు మాత్రమే వచ్చాయి. మరోవైపు ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ ట్రంప్​ న్యాయపోరాటానికి దిగారు. విస్కిన్‌స‌న్‌లో రీకౌంటింగ్ చేయాల‌ని ట్రంప్ టీమ్ డిమాండ్ చేసింది. ఇక మిచిగ‌న్ రాష్ట్రంలో బ్యాలెట్లు లెక్కించ‌వ‌ద్దు అంటూ కోర్టులో దావా వేసింది.

ట్రెండింగ్ వార్తలు