Chinese Rocket : భూమి వైపు దూసుకొస్తున్న రాకెట్..ఎక్కడ ? ఎప్పుడు పడుతుందో తెలియదు

భూమి వైపు దూసుకొస్తున్న చైనా రాకెట్..మరికొద్ది గంటల్లో భూమిని తాకనున్న రాకెట్ శకలాలు.. ఎక్కడ కూలుతుందో తెలియకపోవడంతో ప్రజల్లో భయాందోళనలు..

Chaina

China’s New Space Station : భూమి వైపు దూసుకొస్తున్న చైనా రాకెట్..మరికొద్ది గంటల్లో భూమిని తాకనున్న రాకెట్ శకలాలు.. ఎక్కడ కూలుతుందో తెలియకపోవడంతో ప్రజల్లో భయాందోళనలు..అవును ప్రస్తుతం అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఆ శకలం తుర్కిమెనిస్తాన్‌ లో భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు పడుతుందని అమెరికా మిలిటరీ అంటోంది.

కానీ అలా జరగలేదు. ఈ రాకెట్ ను ట్రాక్ చేస్తున్న స్పేస్ ఆర్గనైజేషన్స్, సైంటిస్టులు మాత్రం భారత కాలమాన ప్రకారం..ఉదయం 8.00 గంటల నుంచి 10 గంటల ఎప్పుడైనా భూమిని తాకొచ్చని అంటున్నారు. అయితే సరిగ్గా ఎప్పుడు..? ఎక్కడ ? కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

గతవారం అంతరిక్షంలో..సొంత స్పేస్ స్పేస్ స్టేషన్ డ్రాగన్ కంట్రీ చైనా ప్రయత్నాలు ముమ్మరం చేపట్టింది. ఏప్రిల్ 29వ తేదీన స్పేస్ స్టేషన్ అంతరిక్షంలో ఏర్పాటు చేయడానికి లాంగ్‌ మార్చ్‌ 5బీ రాకెట్‌ ను విజయవంతంగా స్పేస్ లోకి పంపింది. అయితే..ప్రధాన దశ కోల్పోయి..భూమి వైపు దూసుకొస్తోంది.

Read More : Tirupati Sub-Jail : తిరుపతి సబ్ జైలులో గన్ మిస్ ఫైర్..హెడ్ కానిస్టేబుల్ మృతి