Tirupati Sub-Jail : తిరుపతి సబ్ జైలులో గన్ మిస్ ఫైర్..హెడ్ కానిస్టేబుల్ మృతి

తిరుపతి సబ్ జైలులో గన్ మిస్ ఫైర్ కావడంతో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు.

Tirupati Sub-Jail : తిరుపతి సబ్ జైలులో గన్ మిస్ ఫైర్..హెడ్ కానిస్టేబుల్ మృతి

Tirupati Sub Jail

Updated On : May 9, 2021 / 7:21 AM IST

Gun misfire in Tirupati sub-jail : తిరుపతి సబ్ జైలులో గన్ మిస్ ఫైర్ కావడంతో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు. ఈ ఘటన సబ్ జైలులోని గార్డ్ రూమ్ లో చోటు చేసుకుంది. సబ్ జైలు వాచ్ గార్డు రూం వద్ద తుపాకీ మిస్ ఫైర్ కావడంతో కానిస్టేబుల్ మృతి చెందాడు.

చనిపోయిన హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీ నారాయణ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. సబ్ జైలు వద్ద జరిగిన ఘటన కలకలం రేపింది.

రిలీవర్ సిద్దారెడ్డి రావడంతో బట్టలు మార్చుకునే ప్రయత్నంలో గన్ మిస్ ఫైరింగ్ జరిగినట్లు చెబుతున్నారు. గన్ శబ్ధం అనంతరం కుప్పకూలిన లక్ష్మీ నారాయణ రెడ్డిని చూసి సిద్దారెడ్డి స్థానికుల సహాయంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.

అయితే అప్పటికే లక్ష్మినారాయణరెడ్డి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. జరిగిన సంఘటనపై కానిస్టేబుల్ సిద్ధారెడ్డి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.