భారత్ ను హిందూ దేశంగా మార్చేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారు : బిలియనీర్ జార్జ్ సోరోస్
భారత ప్రధానమంత్రి మోడీపై బిలియనీర్ జార్జ్ సోరోస్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పౌరసత్వ చట్టంతో భారత్ ను హిందూ దేశంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.

భారత ప్రధానమంత్రి మోడీపై బిలియనీర్ జార్జ్ సోరోస్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పౌరసత్వ చట్టంతో భారత్ ను హిందూ దేశంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
భారత ప్రధానమంత్రి మోడీపై బిలియనీర్ జార్జ్ సోరోస్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పౌరసత్వ చట్టంతో భారత్ ను హిందూ దేశంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో జార్జ్ సోరోస్ మాట్లాడుతూ కొన్ని వేల మంది ముస్లింల పౌరసత్వానికి నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలిపారు.
జాతీయవాదం తిరుగబడుతోందన్నారు. భారత్ లో జరుగుతున్న పరిణామాలు భయపెట్టే విధంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన మోడీ.. భారత్ ను హిందూ దేశంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కశ్మీర్ పై శిక్షాత్మకమైన నిబంధనలను విధిస్తున్నారని పేర్కొన్నారు.
అమెరికా-చైనా సంబంధాలపై జార్జ్ సోరోస్ మాట్లాడారు. ట్రంప్ పై ఆయన విమర్శలు చేశారు. ట్రంప్ తన స్వలాభం కోసం జాతి ప్రయోజనాలను కూడా పణంగా పెట్టే వ్యక్తి అని ఆరోపించారు. మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు ఆయన ఏమైనా చేస్తారని చెప్పారు. ట్రంప్ బలహీనతను ఉపయోగించుకుని జిన్ పింగ్ కృత్రిమ మేధస్సు ద్వారా యూఎస్ ప్రజలను తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ఎదురుచూస్తున్నారని వెల్లడించారు.