Blue Origin New Shepard : రోదసీలోకి వెళ్లొచ్చిన అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్!

రోదసీలోకి ప్రపంచ కుబేరుడు, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్ర విజయవంతమైంది. స్పేస్ టూరిజం లక్ష్యంగా జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్ర కొనసాగింది.

Blue Origin New Shepard : రోదసీలోకి వెళ్లొచ్చిన అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్!

Blue Origin New Shepard Capsule Returns To Earth Safely

Updated On : July 20, 2021 / 7:07 PM IST

Blue Origin New Shepard : రోదసీలోకి ప్రపంచ కుబేరుడు, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్ర విజయవంతమైంది. స్పేస్ టూరిజం లక్ష్యంగా జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్ర కొనసాగింది. బ్లూ ఆరిజిన్ సంస్థ న్యూ షెపర్డ్ వ్యోమనౌకలో జెఫ్ బెజోస్ బృందం రోదసీలోకి వెళ్లొచ్చింది. ప్యారాచూట్ల ఉన్న క్యాప్సూల్స్ ద్వారా భూమిపైకి బెజోస్ బృందం సురక్షితంగా ల్యాండ్ అయింది. బెజోస్ తో పాటు రోదసీలోకి 82ఏళ్ల మహిళా పైలట్ వేలీ ఫంక్, 18ఏళ్ల ఓలివర్ డేమన్ మొత్తం ముగ్గురు పర్యాటకులు వెళ్లారు.

100 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎత్తుకు ఈ వ్యోమనౌక వెళ్లింది. తద్వారా తొలి వాణిజ్య వ్యోమనౌక ద్వారా బ్లూ ఆరిజన్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. కర్మన్ రేఖ దాటి రోదసీలోకి బెజోస్ బృందం ప్రవేశించింది. భూమి నుంచి 106 కిలోమీటర్లు ఎత్తుకు ప్రయాణించింది. బెజోస్ తో పాటు అంతరిక్షంలోకి అడుగుపెట్టిన వేలిఫంక్ అతిపెద్ద వయస్సురాలు, అలాగే 18ఏళ్ల కుర్రాడుగా ఓలివెర్ డేమన్ సరికొత్త రికార్డు నెలకొల్పారు.

భార రహిత స్థితిలో 4 నిమిషాలు బెజోస్ టీమ్ గడిపింది. అంతరిక్ష యాత్ర ముగించుకుని విజయవంతంగా భూమిపైకి జెఫ్ బెజోస్ టీమ్ చేరుకుంది. గరిష్ట ఎత్తుకు చేరుకున్న తర్వాత క్యాప్సుల్ వెనుదిరిగింది. పారాచ్యూట్ సాయంతో ఎడారి ప్రాంతంలో సురక్షితంగా బెజోస్ టీమ్ ల్యాండ్ అయింది.