Pakistan Bomb Blast
Imran Khan Party Rally: పాకిస్థాన్ బలూచిస్థాన్లోని సిబిలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా.. ఐదుగురు గాయపడ్డారు. పాకిస్థాన్ లో ఫిబ్రవరి 8న సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల గడువు సమీపిస్తున్న సమయంలో బాంబు పేలుడు ఘటన చోటుచేసుకుంది. జైలులోఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు చెందిన పాకిస్థాన్ తెహ్రిక్ – ఇ -ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ మద్దతుదారులు ర్యాలీ చేస్తున్న క్రమంలో ఈ పేలుడు చోటు చేసుకుంది. అయితే, ఈ పేలుడు పీటీఐ పార్టీ ర్యాలీని లక్ష్యంగా చేసుకొని జరిగిందా? బాంబు పేలుడు ఎలా జరిగిందనే విషయంపై విచారణ కొనసాగుతోందని సీనియర్ పోలీసు అధికారి పర్హాన్ జాహిద్ చెప్పారు. అయితే, మృతుల్లో ర్యాలీలో ఉన్నవారు ముగ్గురు ఉన్నట్లు సమాచారం.
Also Raed : Imran Khan Pakistan : పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు బిగ్‌షాక్.. పీటీఐ పార్టీపై ఈసీ నిషేధం?
ఫిబ్రవరి 8న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఘటన చోటు చేసుకోవటంతో ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పాకిస్థాన్ ఎన్నికల సంఘం తెలిపింది. ప్రభుత్వ రహస్య పత్రాలను లీక్ చేశారనే ఆరోపణలపై పీటీఐ వ్యవస్థాపకుడు, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు పదేళ్ల జైలు శిక్ష విధించిన కొద్ది గంటలకే ఈ బాబు పేలుడు ఘటన చోటు చేసుకోవటం గమనార్హం.
Also Raed : HYD Beautification : మూసీ సుందరీకరణపై టీ సర్కార్ ఫోకస్.. లండన్ థేమ్స్ నదిలా అభివృద్ధిపై ప్రణాళికలు
ఎన్నికల ప్రక్రియను, దాని ఫలితాలకు అంతరాయం కలిగించడమే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ బాంబు దాడికి పాల్పడినట్లుగా ఉందని ఆ దేశ తాత్కాలిక సమాచార మంత్రి జన్ అచక్జాయ్ అన్నారు. హింస జరిగినా ఎన్నికలు జరగాల్సిందేనని, ఇలాంటి దాడులు ఎన్నికల నిర్వహణను నిరుత్సాహపర్చదని అన్నారు.