కరోనా నుంచి కోలుకుని… హాస్పిటల్ నుంచి బ్రిటన్ ప్రధాని డిశ్చార్జ్

బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల బోరిస్ లో కరోనా లక్షణాలు బయటపడటంతో ఆయనకు టెస్ట్ లు చేయగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన తన ఇంట్లోనే సెల్ఫ్ ఐసొలేట్ అయ్యారు. అయితే వారం రోజుల క్రితం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను లండన్ లోని ఓ హాస్పిటల్ కు తరలించి మూడు రోజుల పాటు ఐసీయూలో ఉంచారు.(అమెరికాపై కరోనా పంజా.. అగ్రరాజ్యం అతలాకుతలం)

అయితే ఇప్పుడు ఆయన కోలుకున్నారని,హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారని డౌనింగ్ స్ట్రీట్ వర్గాలు తెలిపాయి. అయితే మెడికల్ టీమ్ సూచన మేరకు ఆయన తిరిగి తన వర్క్ ను వెంటనే ప్రారంభించరని తెలిపాయి.

మరోవైపు బ్రిటన్ లో ఇప్పటివరకు 78వేల991 కరోనా కేసులు నమోదుకాగా,9వేల 875 మరణాలు నమోదయ్యాయి. యూరప్ లో కరోనా ప్రభావం బ్రిటన్ లో ఎక్కువగా ఉండే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

కరోనా నేపథ్యంలో యూకేలో కూడా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే చాలామంది బ్రిటన్ వాసులు లాక్ డౌన్ ను పట్టించుకో్కుండా రోడ్లపైకి వస్తూనే ఉన్నారు. ఇళ్లు దాటి బయటకు రావొద్దని ప్రభుత్వం చేసిన హెచ్చరికలు పట్టించుకోకపోవడం వల్లే బ్రిటన్ లో అత్యధిక కరోనా కేసులు,మరణాల నమోదుకు కారణమైంది.