భారత ‘హీరో’ సైకిల్‌పై బ్రిటన్ ప్రధాని బోరిస్ స్వారీ.. ఎందుకంటే?

  • Publish Date - July 30, 2020 / 06:19 PM IST

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ‘మేడిన్ ఇండియా’ హీరో సైకిల్ తొక్కి అందరిని అబ్బురపరిచారు. కోవిడ్-19 పోరులో భాగంగా స్థూలకాయానికి నిరోధించడమే లక్ష్యంగా బ్రిటన్‌ ప్రభుత్వం కొత్త GBP 2 బిలియన్‌ సైక్లింగ్, వాకింగ్ డ్రైవ్‌ చేపట్టింది.

ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని బోరిస్ ప్రారంభించారు. తొలుత ఆయన మేడిన్ ఇండియా హీరో సైకిల్ తొక్కి ప్రారంభించారు. నాటింగ్‌హామ్‌లోని బీస్ట‌న్ వ‌ద్ద హెరిటేజ్ సెంట‌ర్‌లో సైకిల్ పై బోరిస్ స్వారీ చేశారు. 56 ఏళ్ళ బోరిస్‌కి సైక్లింగ్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు.



హెల్త్, ఫిట్‌నెస్‌ కోసం సైక్లింగ్ తప్పక చేయాలని సూచిస్తున్నారు. బ్రిటన్‌లో కరోనా వైరస్ సోకి మృతి చెందినవారిలో చాలామంది స్థూలకాయులే ఉన్నారని చెప్పారు. అధిక శరీర బరువు వల్ల అకాల మరణానికి దారితీస్తుందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేలాది మైళ్ల కొత్త సెక్యూర్ బైక్ లేన్‌ల ప్లాన్లు, అందరికీ సైకిల్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. కొత్త ఫిట్‌నెస్ వ్యూహంలో భాగంగా ప్రిస్క్రిప్షన్‌లో బైక్‌లు అందుబాటులో ఉన్నాయి.

ప్రధాని ఉపయోగించే వైకింగ్ ప్రో బైక్ భారతదేశపు హీరో మోటార్స్ కంపెనీ యాజమాన్యంలోని ఇన్సిన్క్ బ్రాండ్‌లో భాగం. దీనిని మాంచెస్టర్‌లో రూపొందించారు. పేరెంట్ కంపెనీ హీరో సైకిల్స్ భారతదేశంలో తయారు చేసింది. హీరో సైకిల్స్ వైకింగ్, రిడిక్, రైడాలే బ్రాండ్లను స్వాధీనం చేసుకుంది.



ఇన్సిన్క్ బ్రాండ్ పేరుతో మరో రేంజ్ ను తిరిగి రూపొందించింది. ప్రాణాంతక కరోనావైరస్ సహా ఇతర వ్యాధుల నుంచి వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి బరువు తగ్గాలని పిలుపునిచ్చింది. రోజువారీ దినచర్యలో భాగంగా సైక్లింగ్‌ను ప్రోత్సహించడానికి, రవాణా కేంద్రాలు, నగర కేంద్రాలు, ప్రభుత్వ భవనాల వద్ద మరిన్ని సైకిల్ రాక్‌లు ఏర్పాటు చేయనున్నారు.