United States : 911 నంబర్‌కి ఫోన్ చేసిన బుడ్డోడు.. ఆ తరువాత ఏమైందంటే?

చిన్నపిల్లలు ఒక్కోసారి తెలియక చేసే పనులు ముచ్చటగా అనిపిస్తాయి. ఓ బాలుడు 911 నంబర్ కి ఫోన్ చేశాడు. ఎందుకు చేశాడో? ఆ తర్వాత ఏమైందో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు.

United States : 911 నంబర్‌కి ఫోన్ చేసిన బుడ్డోడు.. ఆ తరువాత ఏమైందంటే?

United States

Updated On : November 6, 2023 / 7:23 PM IST

United States : ఫ్లోరిడాలో ఓ బాలుడు 911 నంబర్‌కి ఫోన్ చేశాడు. వెంటనే పోలీసు వచ్చాడు. అత్యవసర పరిస్థితిల్లో డయల్ చేసే ఆ నంబర్‌‌కి ఆ బాలుడు ఎందుకు ఫోన్ చేశాడో తెలిస్తే మీరు ముందు ఆశ్చర్యపోయినా.. ఆ తర్వాత ముచ్చట పడతారు.

ISRO Chief Somanath : ఇస్రో చీఫ్ సోమనాథ్‌కి ప్రేమతో ఓ బుడ్డోడు ఏం బహుమతి ఇచ్చాడో తెలుసా?

ఫ్లోరిడాలో ఓ బాలుడు 911 నంబర్‌కి డయల్ చేశాడు. వెంటనే ఆ కాల్‌కి స్పందించిన పోలీస్ ఆఫీసర్ ప్రాచ్ట్ బాలుడి ఇంటికి చేరుకున్నాడు. బాలుడి తల్లితో ‘అంతా ఓకేనా.. మాకు 911 నంబర్ నుంచి ఫోన్ వచ్చింది’ అని చెప్పాడు. వెంటనే ఆ కాల్ తన కొడుకు చేసినట్లు అతని తల్లి గుర్తించింది. ‘మేము మీ అబ్బాయితో మాట్లాడొచ్చా?’ అని పోలీస్ ఆఫీసర్ అడిగేసరికి కొడుకుని పిలిచింది.

Maharshtra : అమ్మ కోసం బావి తవ్విన బుడ్డోడు .. త‌ల్లి నీటి క‌ష్టాలు తీర్చిన కొడుకుపై ప్ర‌శంస‌లు

కొడుకుని ‘పోలీస్ కి ఫోన్ చేశావా?’ అని అడిగింది తల్లి..  తనకి 911 నంబర్ గురించి తెలుసని పోలీస్‌కి హగ్ ఇవ్వడానికి చేశానని కొడుకు చెప్పడంతో అతని తల్లి షాకైంది. ఆ పోలీస్ ఆఫీసర్ మాత్రం బాలుడిని దగ్గరకు తీసుకుని 911 నంబర్ ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో చేయాలో ఆ బాలుడికి వివరించాడు. అంతా విన్న ఆ బుడ్డోడు పోలీస్ ఆఫీసర్‌కి సారీ చెప్పాడు. ఈ ఘటనకు సంబంధించిన ఫుటేజ్‌తో పాటు వివరాలను హిల్స్ బరో కౌంటీ షెరీఫ్ ఆఫీస్ పోస్ట్ ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో అందరి మనసుల్ని దోచుకుంది. ఒక్కోసారి పిల్లలు తెలియక చేసే పనులు కూడా ఇలా ముచ్చట గొలుపుతాయన్నమాట.