Russia Ukraine war: యుక్రెయిన్ కు అండగా బ్రిటన్.. మరిన్ని ఆయుధాలు సరఫరా

యుక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించి రెండు వారాలు దాటిపోయింది. ఇప్పటికీ యుక్రెయిన్ ఉరుముతోంది.. రష్యా గర్జిస్తోంది..

Russia Ukraine war: యుక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించి రెండు వారాలు దాటిపోయింది. ఇప్పటికీ యుక్రెయిన్ ఉరుముతోంది.. రష్యా గర్జిస్తోంది.. ఫలితంగా బాంబుల మోత మోగుతోంది. స్కడ్, మిసైల్స్ ప్రయోగాలే కాదు సైరన్ శబ్దాలతో దేశం ఠారెత్తుతోంది. బతుకుజీవుడా అంటూ ప్రజలు బంకర్లలో దాక్కోవాల్సి వస్తోంది. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తోందో.. ఏ దేశం ఏ వైపుకు మద్దతు ఇచ్చి ప్రపంచ యుద్దానికి తెరతీస్తుందోనని ప్రపంచానికి తెలియడం లేదు.

Russia Ukraine war: రెండు వారాలుగా యుద్ధం చేస్తున్న రష్యా, అంత ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది?

ఇప్పటికే గడిచిన ఈ రెండు వారాలలో రష్యా యుక్రెయిన్ కు చెందిన ఆస్తులను తీవ్రంగా నష్టపరిచింది. దేశంలోని వివిధ నగరాల నుండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించగా.. ఇప్పటికే ఏ దేశాలకు చెందిన పౌరులను ఆయా దేశాలు ఎంబసీల ద్వారానే సొంత దేశాలకు తరలించుకున్నారు. రష్యా యుక్రెయిన్ పై అస్త్రశస్త్రాలను వాడుతోండడంతో ఇటు ప్రాణ నష్టం, అటు ఆస్తి నష్టం కూడా భారీగా జరుగుతోంది.

Russia Ukraine War : యుక్రెయిన్‌కు భారీ విరాళమిచ్చిన స్టార్‌ హీరో.. ఆయన ఎవరంటే?

రష్యా- ఉక్రెయిన్‌ మధ్య జరుగుతున్న యుద్ధంతో ప్రపంచ దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. యుద్ధం వద్దని చెప్పలేక అలాని ఊరుకోలేక తల్లడిల్లుతున్నాయి. ఈ రెండు దేశాలలో ఇప్పటికే కొన్ని దేశాలు వాళ్ళకి నచ్చిన దేశాలకు మద్దతిచ్చి అండగా ఉంటున్నాయి. ఇందులో బ్రిటన్ రష్యాకి మద్దతు ప్రకటించి ఇప్పటికే కొన్ని ఆయుధాలను కూడా పంపించారు. ఇప్పుడు మరికొన్ని ఆయుధాలను పంపనున్నట్లు ప్రకటించింది.

Russia Ukraine War : యుక్రెయిన్‌‌కు సాయం చేస్తానన్న పోలాండ్.. అడ్డుచెప్పిన అమెరికా..!

ప్రత్యేకించి ట్యాంక్ విధ్వంసక క్షిపణులను అంజేయనున్నట్లు బ్రిటన్ వెల్లడించింది. ఇప్పటికే బ్రిటన్ 2 వేల మినీ ట్యాంక్ విధ్వంసక క్షిపణులను పంపగా.. ఇప్పుడు అదనంగా మరో 1615 అందజేయనున్నట్లు బ్రిటన్ మంత్రి బెన్ వాలెస్ తెలిపారు. నిత్యావసరాలు, వైద్య, యుద్ధ, సానిక సామగ్రి సరఫరా కూడా మరింత పెంచనున్నట్లు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు