బరువు తగ్గండి బాబులు: జంక్ ఫుడ్‌కు పబ్లిసిటీకి నో చెప్పనున్న గవర్నమెంట్

Unhealthy Food: మరి కొద్ది నెలల్లో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ లాంటి ప్రమోషన్లకు చెక్ పెట్టనున్నది బ్రిటన్. ఎక్కువ మొత్తంలో కొవ్వు, షుగర్, సాల్ట్, సాఫ్ట్ డ్రింక్స్ లాంటి ఫుడ్ కు ఏప్రిల్ 2022నుంచి ఎలాంటి ప్రచారం ఉండకూడదని సోమవారం కన్ఫామ్ చేసింది. ప్రజా ఆరోగ్యం కాపాడటానికి ఒబెసిటీని నిర్మూలన చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.

బ్రిటన్ లో సుదీర్ఘ కాలం ప్రజారోగ్యానికి ఇబ్బందిపెడుతున్న సమస్య.. ఒబెసిటీ. ఇంగ్లాండ్ లో ఉండే 2/3వ వంతు పెద్దలు అధిక బరువుతో, 1/3వ వంతు పిల్లలు ప్రైమరీ స్కూల్స్ ను వదిలేస్తున్నారు. ఇకపై అటువంటి ఉత్పత్తులకు ప్రమోషన్స్ లేకుండా చేయడంతో పాటు షాప్ ఎంట్రన్స్ ల వద్ద అడ్వర్టైజ్‌మెంట్స్ ఆపేయాలని నిర్ణయించారు.

‘ప్రమోషన్స్ ను అడ్డుకోవాలనుకుంటున్నాం. ఈ క్రమంలోనే కొత్త పద్ధతులను హెల్తీ ఛాయీస్ గా ప్రవేశపెడుతున్నాం. దేశ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కొత్త వాతావరణం తీసుకురావాలనుకుంటున్నాం’ అని ఆరోగ్యశాఖ మంత్రి చెప్పారు.

ముందుగా జులై నెలలోనే ఒకటి కొనండి ఒకటి ఉచితంగా పొందండి అనే డీల్స్ ను నిషేదించాలని ప్రపోజ్ చేసింది బ్రిటన్. ఆ తర్వాత టీవీ, ఆన్‌లైన్ యాడ్ లను 9గంటల కంటే ముందు టెలికాస్ట్ చేయొద్దని చెప్పింది. గత నెలలో ప్రభుత్వం పూర్తిగా నిషేదాలు ఇచ్చేసింది. బరువు తగ్గించాలని ఇటువంటి రిస్క్ లు రాకుండా ఉండేందుకు అధికారులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రధాని బోరిస్ జాన్సన్ సైతం బహిరంగంగా కొవిడ్-19 వచ్చే ముందు అధిక బరువుతో ఇబ్బందిపడినట్లు చెప్పారు.