Bus Mishap : ఘోర ప్రమాదం.. లోయలో పడిపోయిన బస్సు, 51 మంది దుర్మరణం..
ఈ దుర్ఘటనపై అధ్యక్షుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

Bus Mishap : సెంట్రల్ అమెరికాలోని గ్వాటెమాల సిటీలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 51 మంది మరణించారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో 75 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వెంటనే సమాచారం అందుకున్న సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 51 మంది మృతదేహాలను వెలికితీసినట్లు సమాచారం.
మరికొందరు నదిలో కొట్టుకుపోయారని, వారి కోసం గాలింపు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన 10 మందిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో 36 మంది పురుషులు, 15 మంది మహిళలు ఉన్నారు.
Also Read : వామ్మో బంగారం ధరలు ఎంతగా పెరిగిపోనున్నాయో తెలుసా? పసిడిపై పెట్టుబడి పెట్టారనుకో…
గ్వాటెమాల రాజధాని వెలుపల రద్దీగా ఉండే మార్గంలో బస్సు వెళ్తోంది. ప్రమాదవశాత్తు వంతెన పైనుండి లోయలోకి పడిపోయింది. గ్వాటెమాల సిటీ మోయిసెస్ కాస్టిల్లో శివార్లలో వంతెన నుండి లోయలోకి పడిపోయింది. ఈ ఘోర ప్రమాదం స్థానికంగా పెను విషాదం నింపింది.
ఈ దుర్ఘటనపై గ్వాటెమాలా అధ్యక్షుడు బెర్నార్డో అరేవా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. మరోవైపు మూడు రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించారు.