డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన 10నిమిషాలకే యాక్సిడెంట్ చేసేశాడు

చైనాలో ఓ వ్యక్తి డ్రైవింగ్ టెస్ట్ పాసై 10నిమిషాలు కూడా కాకముందే ప్రమాదం భారీన పడ్డాడు. అలా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడో లేదో.. ఇలా యాక్సిడెంట్ చేశాడు. అతని పేరు జాంగ్, ఈ వ్యక్తి డ్రైవింగ్ టెస్ట్‌కు వెళ్లి తిరిగోస్తుండగా.. ఓ బ్రిడ్జి మీదు వెళ్తూ ఒక్కసారిగా అదుపుతప్పి నేరుగా నదిలోకే కారును పోనిచ్చాడు.
ఈ ఘటన అక్కడే దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. అక్కడే ఉన్న జున్యి అనే ట్రాఫిక్ పోలీసులు ఈ యాక్సిడెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ కారు యజమాని 10 నిమిషాల క్రితమే లైసెన్స్ పొందినట్లు తెలియజేశారు. కారులో వెళ్తూ ఫోన్‌లో మేసేజ్‌లకు రిప్లే ఇస్తున్నాడు. దీంతో అతని కారు బ్యాలెన్స్ తప్పి నదిలో పడిపోయిందని తెలిపారు.
విషయమేంటంటే.. కారు యాక్సిడెంట్ జరిగిన సమయంలో బ్రిడ్జిపై ఇద్దరు వ్యక్తులు కారుకు ముందుగా వచ్చారు. దీంతో డ్రైవర్ భయాందోళనకు గురై ఒక్కసారిగా ఎడమవైపు తిప్పడంతో కారుతో సహా నదిలో పడిపోయాడు. అనంతరం కారును క్రేన్ సహాయంతో నదిలో నుంచి బయటకు తీశారని పెర్కన్నారు.
See Also | ఆరుగురు పిల్లలను కనండి..దేశానికి మంచిది