భారత రాజ్యాంగం, ప్రపంచ మానవ హక్కుల చట్టాన్ని ఉల్లంఘిస్తోన్న CAA : అమ్నెస్టీ

ఇటీవల అమల్లోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) భారత రాజ్యాంగం, అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘిస్తోంది, మతం ఆధారంగా వివక్షను చట్టబద్ధం చేస్తుందని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అమెరికా చట్టసభ సభ్యులకు తెలిపింది.

  • Published By: veegamteam ,Published On : February 2, 2020 / 03:44 AM IST
భారత రాజ్యాంగం, ప్రపంచ మానవ హక్కుల చట్టాన్ని ఉల్లంఘిస్తోన్న CAA : అమ్నెస్టీ

Updated On : February 2, 2020 / 3:44 AM IST

ఇటీవల అమల్లోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) భారత రాజ్యాంగం, అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘిస్తోంది, మతం ఆధారంగా వివక్షను చట్టబద్ధం చేస్తుందని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అమెరికా చట్టసభ సభ్యులకు తెలిపింది.

ఇటీవల అమల్లోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) భారత రాజ్యాంగం, అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘిస్తోంది, మతం ఆధారంగా వివక్షను చట్టబద్ధం చేస్తుందని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అమెరికా చట్టసభ సభ్యులకు తెలిపింది. 2019 డిసెంబర్‌లో పార్లమెంటు ఆమోదించిన కొత్త పౌరసత్వ చట్టం.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లో ముస్లిమేతరులు హింసించబడి, వలసవచ్చిన మతపరమైన మైనారిటీలకు పౌరసత్వం కల్పిస్తుంది. కొత్త చట్టం ఏ పౌరసత్వ హక్కులను తిరస్కరించదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. పొరుగు దేశాల అణగారిన మైనారిటీలను రక్షించడానికి, వారికి పౌరసత్వం ఇవ్వడానికి తీసుకురాబడిందని తెలిపింది. 

భారత పార్లమెంటు పౌరసత్వ సవరణ చట్టాన్ని ఆమోదించిందని, ఇది మతం ఆధారంగా వివక్షను చట్టబద్ధం చేస్తుందని బెన్కోస్మే అన్నారు. భారత రాజ్యాంగం, అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘిస్తోందని తెలిపారు. తగిన ప్రక్రియను అనుసరించి సిఎఎపై చట్టాన్ని తీసుకువచ్చామని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. సిఎఎ భారతదేశం అంతర్గత విషయమని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ చెప్పారు. ఇది సరైన పద్ధతిలో, ప్రజాస్వామ్య మార్గాల ద్వారా తీసుకొచ్చామని తెలిపారు.

 
గత నెలలో ప్రధాని నరేంద్ర మోడీ సిఎఎను సమర్థిస్తూ.. ఈ చట్టం పౌరసత్వాన్ని హరించడం గురించి కాదని.. పౌరసత్వం ఇవ్వడం గురించి అన్నారు. భారతదేశాన్ని, రాజ్యాంగాన్ని విశ్వసించే ప్రపంచంలోని ఏ దేశానికి చెందిన ఏ వ్యక్తి అయినా సరైన ప్రక్రియ ద్వారా భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్న విషయం మనందరికీ తెలుసని, అందులో ఎటువంటి సమస్య లేదన్నారు. రెండు సబ్ కమిటీలు సంయుక్తంగా గ్లోబల్ రిలిజియస్ పీడనపై విచారణను నిర్వహించాయి.