Chameleon Diamond: రంగులు మారుస్తున్న వజ్రం..సైటిస్టులు సైతం షాక్

ఊసరవెల్లిలా రంగులు మార్చే వజ్రం ఆశ్చర్యనానికి గురిచేస్తోంది. రంగులు మారుస్తున్న ఈ అరుదైన వజ్రాన్ని చూసి సైంటిస్టులు కూడా ఆశ్చర్యపోతున్నారు.

Chameleon Diamond

Chameleon Diamond: ఊసరవెల్లి తన రక్షణ కోసం రంగులు మారుస్తుందనే విషయం తెలిసిందే.కానీ ముత్యాలు, పగడాలు,వజ్రాలు మార్చుకుంటాయా? అంటే లేదనే అంటాం. కానీ ఓ వజ్రం రంగులు మారుతోంది. ఈ రంగులు మారే వజ్రాన్ని చూసిన సైంటిస్టుల సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. యూఎస్ లోని కాలిఫోర్నియాలోని కార్ల్స్ బాడ్‌లో గల జియోలాజికల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అమెరికా(GIA) కు చెందిన సైంటిస్ట్ స్టెఫానీ పెరౌడ్స్ ఈ రంగులు మార్చే వజ్రాన్ని కనుగొన్నారు. ఈ వజ్రాన్ని శాస్త్రీయంగా ‘క్రయోజెనిక్ డైమండ్స్’ అని పిలుస్తారని తెలిపారు. కాగా ఇటువంటి కొన్ని వజ్రాలను గతంలో కూడా లభ్యమయ్యాయి. కానీ అవి చల్లని వాతావరణంలో ఉంచితేనే రంగులు మారేవి. చల్లని వాతారణంలో పెడితే ఆ వజ్రాలు బూడిదరంగులోకి మారుతాయని తెలిపారు.

కానీ తాజాలా లభ్యమైన డైమండ్ మాత్రం వెరీ డిఫరెంట్ అంటున్నారు. ఈ వజ్రం బూడిద రంగుతో పాటు, పసుపు రంగులోకి కూడా మారుతోందని తెలిపారు. అందుకే ఈ వజ్రాలను ఊసరవెల్లి వజ్రాలు (Chameleon Diamond)అని పిలుస్తున్నారు సైంటిస్టులు. ఈ వజ్రం అత్యంత విలువైనదిగా భావిస్తున్నారు.

Read more : Botswana: ప్ర‌పంచంలోనే మూడో అతిపెద్ద వజ్రం.. విలువెంతో తెలుసా?

స్టెఫానీ పెర్సౌడ్ కస్టమర్ల కోసం వజ్రాలను గ్రేడింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో.. మూడో రకం రంగు మార్చే వజ్రాన్ని గుర్తించారు. ఇది చాలా అరుదైన వజ్రం అని ధరను మాత్రం ఇంకా నిర్ణయించకపోయినా ఇది చాలా ఖరీదు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఊసరవెల్లి వజ్రం ప్రత్యేక గురించి చెప్పాలంటే.. ఈ వజ్రాన్ని చేతుల్లో పెట్టుకున్నా…ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత ఉన్నా కూడా రంగు మారదు. కానీ 196 ° C ఉష్ణోగ్రతలో రంగు మారుతుందట.ఈ వజ్రంపై కాంతి పడినా.. వేడిగా ఉన్న వాతావరణంలో ఉంచినా.. శీతల ప్రాంతంలో ఉంచినా రంగు మారడం దీని ప్రత్యేకత.

Read more : woman finds rare diamond : పార్కులో వాకింగ్ చేస్తుంటే వృద్ధురాలికి దొరికిన అరుదైన వజ్రం

కానీ వజ్రాలు రంగు ఎందుకు మారతాయనేది ఇప్పటికీ ఒక రహస్యంగానే మిగిలింది. కానీ, కొన్ని వజ్రాలు 200 °C కు వేడి చేసినప్పుడు లేదా 24 గంటలు చీకటిలో ఉంచినప్పుడు వాటి రంగును మార్చుకుంటున్నట్లు సైంటిస్టులు గ్రహిచారు.రంగులు మార్చే వజ్రాన్ని మొదటిసారిగా 1866 లో పర్షియన్ వజ్రాల వ్యాపారి జార్జెస్ హాల్ఫెన్ కనుగొన్నారట. కానీ..1943 వరకు రంగు మారే వజ్రాలు ఆభరణాల వ్యాపారంలో పెద్దగా గుర్తించబడలేదట.

ట్రెండింగ్ వార్తలు