Botswana: ప్ర‌పంచంలోనే మూడో అతిపెద్ద వజ్రం.. విలువెంతో తెలుసా?

డైమండ్ డైమండే.. దాని తోక్కే వేరు.. దాని మెరుపే ప్రత్యేకం. అందుకే మన దగ్గర ఎంత బంగారం ఉన్నా ఒక్క డైమండ్ ఆభరణమైనా ఉండాలని మధ్యతరగతి మనుషులు కూడా ఆరాటపడతారు. దాని క్వాలిటీని బట్టి.. దాని సైజును బట్టి దాని ధరలో తేడాలుంటాయి.

Botswana: ప్ర‌పంచంలోనే మూడో అతిపెద్ద వజ్రం.. విలువెంతో తెలుసా?

Botswana

Botswana: డైమండ్ డైమండే.. దాని తోక్కే వేరు.. దాని మెరుపే ప్రత్యేకం. అందుకే మన దగ్గర ఎంత బంగారం ఉన్నా ఒక్క డైమండ్ ఆభరణమైనా ఉండాలని మధ్యతరగతి మనుషులు కూడా ఆరాటపడతారు. దాని క్వాలిటీని బట్టి.. దాని సైజును బట్టి దాని ధరలో తేడాలుంటాయి. ఇది వేల నుండి కోట్ల రూపాయల వరకు ఉంటుంది. అయితే, ప్రపంచంలోనే అతి పెద్దదైన వాటిలో మూడవది తాజాగా బయటపడింది. ఇటీవ‌ల బోట్స్వానాలో జ‌రిపిన తవ్వ‌కాల్లో ప్ర‌పంచంలోనే మూడో అతిపెద్దదిగా భావిస్తున్న‌ వజ్రం వెలికితీశారు.

మొత్తం 1098 క్యారెట్ల బ‌రువున్న ఈ వజ్రం దొరికిన రెండు వారాల తర్వాత బోట్స్వానా అధ్యక్షుడు మోగ్‌వీట్సీ మాసిసికి స్థానిక వ‌జ్రాల సంస్థ డెబ్స్వానా బుధవారం చూపించింది. 50 సంవ‌త్స‌రాల త‌మ కార్య‌క‌లాపాల చ‌రిత్ర‌లో డెబ్స్వానా క‌నుగొన్న అతి పెద్ద వ‌జ్రం ఇద‌ని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ లినెట్ ఆర్మ్‌స్ట్రాంగ్ చెప్తున్నారు. ఈ వ‌జ్రం దాదాపు 73 మి.మీ పొడవు, 52 మి.మీ వెడల్పు , 27 మిమీ మందంతో ఉండగా ప్రాథమిక విశ్లేషణ ఆధారంగా దీనిని ప్రపంచంలో మూడవ అతిపెద్ద వ‌జ్రంగా భావిస్తున్నారు.

దీనిని ఎలా విక్రయించాలనే దానిపై డెబ్స్వానా సంస్థ‌ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోగా కనీసం ఈ వ‌జ్రం యొక్క ఖ‌రీదును కూడా ఇంకా అంచ‌నా వేయ‌లేదు. ఇక ఈ వ‌జ్రానికి ఇంకా పేరు కూడా ఖ‌రారు చేయ‌లేదు. ఇప్ప‌టివరకు ప్రపంచంలోనే వెలికితీసిన అతిపెద్ద వజ్రం 3106 క్యారెట్ల బ‌రువున్న‌ కుల్లినన్ గా చెప్తుండగా.. దీనిని 1905లో దక్షిణాఫ్రికాలో స్వాధీనం చేసుకున్నారు. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద వజ్రం లెస్డి లా రోనా కాగా దీనిని కూడా 2015 లో బోట్స్వానాలోనే కనుగున్నారు.. ఇప్పుడు డెబ్స్వానాకు దొరికింది మూడవ అతిపెద్ద వజ్రంగా వెలుగులోకి వచ్చింది.