COVID Vaccines : ఈ వ్యాక్సిన్లు ఎంతటి ఉష్ణోగ్రతనైనా తట్టుకుంటాయి..సరికొత్త కోవిడ్ టీకాలు

విశ్వ విద్యాలయ పరిశోధకులు వ్యాక్సినేషన్ల నిల్వ, సరఫరాపై దృష్టి కేంద్రీకరించారు. అసలు ఉష్ణోగ్రత లేని..సరికొత్త కోవిడ్ టీకాలను తయారు చేసి సంచలనం సృష్టించారు.

California San Diego : కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను పలు దేశాలు పంపిణీ చేస్తున్నాయి. అయితే..వీటిని తయారు చేయడం దగ్గరి నుంచి నిల్వ చేయడం..సరఫరా చేయడం..ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటిని నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది. వసతులు లేని…మారుమూల గ్రామీణ ప్రాంతాలకు వీటిని సరఫరా చేయాలంటే..ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో ఓ విశ్వ విద్యాలయ పరిశోధకులు వ్యాక్సినేషన్ల నిల్వ, సరఫరాపై దృష్టి కేంద్రీకరించారు. అసలు ఉష్ణోగ్రత లేని..సరికొత్త కోవిడ్ టీకాలను తయారు చేసి సంచలనం సృష్టించారు. వ్యాక్సినేషన్ల రంగంలో ఇదొక మైలురాయిగా అభివర్ణిస్తున్నారు.

Read More : Ivermectin : కరోనా చికిత్సలో ఐవర్‌మెక్టిన్ వాడితే అనర్దాలు తప్పవు.. నిపుణుల హెచ్చరిక

కాలిఫోర్నియా విశ్వ విద్యాలయ శాస్త్రవేత్తలు…వీటిని అభివృద్ధి చేశారు. ఈ వ్యాక్సిన్లు ఎంతటి ఉష్ణోగ్రతలైనా తట్టుకోగలవు. అంతేగాకుండా తక్కువ ఖర్చుకే వీటిని తయారు చేయవచ్చంటున్నారు. శక్తివంతమైన యాంటీబాడీలను అధిక సంఖ్యలో ఉత్పత్తి చేయగలవని పరిశోధకలు చెబుతున్నారు. కౌపియా మొక్కలు, ఇ-కోలి బ్యాక్టీరియాను ఉపయోగించి..కోట్ల సంఖ్యలో ప్లాంట్ వైరస్ ను, బంతి ఆకారంలో అతి సూక్ష్మ బ్యాక్టీరియో ఫేజ్ లను అభివృద్ధి చేశారు.

Read More : Hetero : కరోనా ఔషధం ‘టోసిరా’ అత్యవసర వినియోగానికి ఆమోదం

తర్వాత..వాటికి కరోనా వైరస్ లో ఉండే స్పైక్ ప్రొటీన్ ను జత చేశారు. శరీరంలోకి ఇవి ప్రవేశించగానే..రోగ నిరోధక వ్యవస్థ స్పందించి..కోవిడ్ యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుందని పరిశోధకులు వెల్లడించారు. ఎలుకలపై ప్రయోగించారు. ఈ ప్రయోగాలు విజయవంతమయ్యాయి. తదుపరి దశలో మనుషులపై ప్రయోగాలు నిర్వహించి..వాటి భద్రత, పని తీరును అంచనా వేయనున్నారు. మొత్తానికి వ్యాక్సినేషన్ రంగంలో సరికొత్త మార్పులు సృష్టించిందంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు