Ivermectin : కరోనా చికిత్సలో ఐవర్‌మెక్టిన్ వాడితే అనర్దాలు తప్పవు.. నిపుణుల హెచ్చరిక

కరోనా చికిత్సలో ఐవర్‌మెక్టిన్ ఔషధం వాడితే అనర్దాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వలన వికారం, మతిమరుపుతోపాటు ప్రాణాలు పోయే అవకాశం ఉందని తెలిపారు.

Ivermectin : కరోనా చికిత్సలో ఐవర్‌మెక్టిన్ వాడితే అనర్దాలు తప్పవు.. నిపుణుల హెచ్చరిక

Ivermectin

Ivermectin : కరోనా సమయంలో అనేక రకాల మందులను సూచించారు వైద్యులు. ఇందులో కొన్ని వ్యాధినిరోధక శక్తి పెంచేవి ఉంటే, మరికొన్ని విటమిన్స్ సంబందించిన మందులు ఉన్నాయి. అయితే వైద్యులు సూచించని మందులు కొన్ని సామజిక మాధ్యమాల ద్వారా వైరల్ అయ్యాయి. ఇలా వైరల్ అయిన వాటిలో దుష్ప్రభావాన్ని కలిగించే ఔషదాలు చాలా ఉన్నాయి.

ఇదే సమయంలో వైరస్ పై పోరుకు అనేక రకాల మందులను వాడారు.. ఈ నేపథ్యంలోనే మనుషు పెంపుడు జంతువుల్లో పరాన్న జీవుల నివారణకు వాడే ఐవర్‌మెక్టిన్ ఔషధాన్ని కరోనా రోగులు తీసుకున్నారు. అయితే కోవిడ్ చికిత్సలో ఈ ఔషధం తీసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ ఔషధం కరోనాను కట్టడి చేస్తుందని ఆధారాలు లేవని చెబుతున్నారు. ఈ మందును అతిగా వాడటం వలన వికారం, మతిమరుపు, మూర్ఛతోపాటు మరణం కూడా సంభవించవచ్చని అమెరికాకు చెందిన ఫెడరల్ డ్రగ్ ఏజెన్సీ హెచ్చరించింది. జంతువుల కోసం తయారు చేసిన ఔషధాన్ని మనుషులు తీసుకోవడం చాలా ప్రమాదమని చెబుతున్నారు. ఒక్కోసారి దీని ప్రభావం వెయ్యిరెట్లు ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

అమెరికాలో కరోనా రోగులు పశువుల మెడికల్ షాపుల నుంచి ఈ మందు తీసుకెళ్లి వాడుతుండటం పట్ల వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది దుష్ప్రభావాలకు గురి చేస్తుందని హెచ్చరిస్తున్నారు.