Hetero : కరోనా ఔషధం ‘టోసిరా’ అత్యవసర వినియోగానికి ఆమోదం

కరోనా కారణంగా ఆస్పత్రి పాలై చికిత్సలో భాగంగా సిస్టమిక్‌ కోర్టికోస్టెరాయిడ్స్‌, అదనపు ఆక్సిజన్‌, నాన్‌ ఇన్‌వాసివ్‌ లేదా ఇన్‌వాసివ్‌ మెకానికల్‌ వెంటిలేషన్‌ లేదా ఎక్స్‌ట్రా కార్పొరియల

Hetero : కరోనా ఔషధం ‘టోసిరా’ అత్యవసర వినియోగానికి ఆమోదం

Hetero Tocira

Hetero Tocira : ప్రముఖ ఔషద ఉత్పత్తుల కంపెనీ హెటెరో ఆవిష్కరించిన టోసిలిజుమాబ్‌ (టోసిరా) జనరిక్‌ ఔషధాన్ని భారత్‌లో పరిమిత స్థాయిలో అత్యవసర వినియోగ అనుమతికి డీసీజీఐ అనుమతించింది.

కరోనా బారిన పడి ఆస్పత్రి పాలై చికిత్సలో భాగంగా సిస్టమిక్‌ కోర్టికోస్టెరాయిడ్స్‌, అదనపు ఆక్సిజన్‌, నాన్‌ ఇన్‌వాసివ్‌ లేదా ఇన్‌వాసివ్‌ మెకానికల్‌ వెంటిలేషన్‌ లేదా ఎక్స్‌ట్రా కార్పొరియల్‌ మెంబ్రెన్‌ ఆక్సిజినేషన్‌ (ఎక్మో) పొందుతున్న యుక్త వయస్సు వారికి ఈ జెనరిక్‌ ఔషధాన్ని చికిత్సలో భాగం చేయడానికి వీలు దక్కనుంది. ప్రపంచవ్యాప్తంగా కొరత ఉన్న టోసిలిజుమాబ్‌ను భారత్‌లో సరఫరా చేసేందుకు ఈ అనుమతులు తమకు ఎంతో ముఖ్యమైనవని, ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ సరైన రీతిలో సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నామని హెటిరో గ్రూప్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ బి పార్థసారథి రెడ్డి తెలిపారు.

Best Drinks : శరీరంలో కొవ్వును తగ్గించే పది పానీయాలు..

రొచె సంస్థ‌కు చెందిన టొసిలిజుమాబ్ ఔష‌ధాన్ని ఇక ఇండియాలో హెటిరో సంస్థ త‌యారీ చేయ‌నున్న‌ది. ఈ నెల చివ‌ర వ‌ర‌కు మ‌న దేశంలో ఈ ఔష‌ధం అందుబాటులోకి రానుంది. టొసిరా బ్రాండ్ నేమ్‌తో దీన్ని అమ్మ‌నున్నారు. డెల్టా వేరియంట్ దూకుడుతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా టొసిలిజుమాబ్ ఔష‌ధాల కొర‌త ఏర్ప‌డింది. ఆర్థ్ర‌టిస్ డ్ర‌గ్ అయిన టొసిలిజుమాబ్‌.. కోవిడ్ రోగుల్లో మ‌ర‌ణాల‌ను త‌గ్గించింది. ఈ ఔష‌ధం తీసుకున్న వారిలో వెంటిలేట‌ర్ అవ‌స‌రం లేకుండా చేసింది. హైద‌రాబాద్‌లో ఉన్న హెటిరో యూనిట్‌లో టొసిరా ఔష‌ధాన్ని త‌యారు చేయ‌నున్నారు. రెమ్‌డిసివిర్‌, ఫావిపిరావిర్ డ్ర‌గ్స్‌ను కూడా హెటిరో త‌యారు చేస్తోంది. Roche’s Actemra/RoActemra కు Tocilizumab 400mg/20ml బయో సిమిలర్ వెర్షన్.

Rs 800 KG Bhindi : ఈ బెండ‌కాయ‌లు కిలో రూ.800.. ఎందుకంత కాస్ట్లీ అంటే

దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 38వేల 948 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,30,27,621కు చేరింది. ఇందులో 4,04,874 యాక్టివ్‌ కేసులున్నాయి. 3,21,81,995 మంది బాధితులు కోలుకున్నారు. 4,40,752 మంది వైరస్‌ తో మరణించారు. ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 43,903 మంది కోలుకోగా, 219 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అదేవిధంగా తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క కేరళలోనే 26వేల 701 పాజిటివ్‌ కేసులు ఉన్నాయని, 74 మంది మరణించారని తెలిపింది. కాగా, దేశవ్యాప్తంగా 68,75,41,762 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామంది.

దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ 5 వరకు 53,14,68,867 నమూనాలకు కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ICMR‌) ప్రకటించింది. ఇందులో ఆదివారం 14,10,649 మందికి పరీక్షలు చేశామంది.