Bald Head: బట్టతలోడా.. అంటూ కామెంట్ చేస్తున్నారా? జాగ్రత్త.. జైలుకెళ్లాల్సి వస్తుంది..

పురుషుల్లో బట్టతల అనేది కామన్ గా మారింది. వాతావరణంలో మార్పులు, మనం తీసుకొనే ఆహారపు అలవాట్ల కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా బట్ట తల అనేది వస్తుంది. ప్రస్తుత కాలంలో బట్టతల వస్తున్న వారి సంఖ్య ...

Bald Head: బట్టతలోడా.. అంటూ కామెంట్ చేస్తున్నారా? జాగ్రత్త.. జైలుకెళ్లాల్సి వస్తుంది..

Bald Head

Updated On : May 14, 2022 / 12:54 PM IST

Bald Head: పురుషుల్లో బట్టతల అనేది కామన్ గా మారింది. వాతావరణంలో మార్పులు, మనం తీసుకొనే ఆహారపు అలవాట్ల కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా బట్ట తల అనేది వస్తుంది. ప్రస్తుత కాలంలో బట్టతల వస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అయితే బట్టతల ఉన్నవారిని కామెంట్లు చేస్తుండటం తరుచుగా వింటాం. ‘బట్టతలోడా ఏంట్రా’ అంటూ పలువురు కామెంట్లు చేస్తుంటారు. ఇక నుంచి అలాంటి కామెంట్లు చేశారంటే మీరు జైలు ఊసలు లెక్కపెట్టేందుకు సన్నద్ధం కావాల్సిందే.. బట్టతల పై ఎవరైనా కామెంట్ చేస్తే వారు లైంగిక వేధింపులకు పాల్పడినట్లే లేక్క.. ఇటీవలే కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇంతకీ ఎక్కడి కోర్టు..? ఏ దేశంలో కోర్టు అనుకుంటున్నారా..

బట్టతలని బాధపడకండి.. అమ్మాయిలను ఆకర్షించే సెక్సీలు మీరే!

బట్టతలపై తోటి ఉద్యోగులు, స్నేహితులు జోక్‌లు వేస్తుండటం మనం చూస్తూనే ఉంటాం. ఈ క్రమంలో బట్టతల ఉన్నవారు ఉద్యోగ ప్రదేశంలో ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నారు. యూకే లోని ఓ వ్యక్తికి ఇలాంటి సమస్యే ఎదురైంది. ఇంగ్లాండ్‌లోని వెస్ట్ మార్క్‌షైర్‌లో బ్రిటిష్ బంగ్ మాన్యుఫాక్చరింగ్ అనే కంపెనీ ఉంది. టోనీ‌ఫిన్ అనే వ్యక్తి ఈ కంపెనీలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుండేవాడు. అయితే అతడికి బట్టతల ఉండటంతో సూపర్‌వైజర్ బట్టతలపై జోకులేస్తుండేవాడు. పలుసార్లు అలా కామెంట్స్ చేయొద్దని చెప్పినా వినిపించుకోకుండా టోనీఫిన్ బట్టతలపై కామెంట్ చేసి అతన్ని ఉద్యోగం నుంచి తీసేశారు. అకస్మాత్తుగా ఉద్యోగం నుంచి తొలగించడతో ఆగ్రహంతో సదరు కంపెనీ తీరుపై షెఫీల్డ్‌లోని ఎంప్లాయిమెంట్ ట్రైబ్యునల్లో దావా వేశాడు. ఆ పిటిషన్ పై ట్రిబ్యునల్ విచారించింది.

Baldness : బట్టతల సమస్యతో బాధపడుతున్నారా…ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా?..

‘బట్టతల’ పేరుతో పిలవడం… అవమానించడమా? లైంగికంగా వేధించడమా? అన్న అంశంపై షెఫీల్డ్ కు చెందిన ఎంప్లాయ్ మెంట్ ట్రైబ్యునల్ లో ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో వాదోపవాదాలు జరిగాయి. న్యాయమూర్తి జోనాథాన్ బ్రెయిన్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ట్రైబ్యునల్ ఈ కేసుపై విచారణ జరిపి తాజాగా తన తీర్పును వినిపించింది. బట్టతల పై కామెంట్ చేసిన, జోకులు వేసి అవమానపర్చినా లైంగిక వేధింపులకు పాల్పడిదాని కిందకే వస్తుందని ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించిన వ్యక్తికి కంపెనీ నష్టపరిహారం చెల్లించాలని, ఎంత చెల్లించాలనేది త్వరలో నిర్ణయిస్తామని కోర్టు తెలిపింది.