PM Birth Date Change: కలిసి రావడంలేదని పుట్టిన తేదీని మార్చుకుంటున్న ఆ దేశ ప్రధాని

దాదాపు 35 ఏళ్లుగా కంబోడియా ప్రధానిగా మిలిటరీ కమాండర్ గా పదవిలో కొనసాగుతున్న హున్ సేన్..గత కొన్నేళ్లుగా తప్పుడు పుట్టిన తేదీని ఉపయోగిస్తున్నారు.

Cambodia

PM Birth Date Change: రాశి ఫలాలను అతిగా నమ్మే వారు, మూఢనమ్మకాల పేరుతో విచిత్రమైన పనులు చేసేవారిని అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. జీవితంలో కలిసి రావడం లేదంటూ కొందరు వ్యక్తులు తమ పేర్లను మార్చుకున్న ఘటనలు అనేకం ఉన్నాయి. కానీ కలిసి రావడం లేదంటూ ఏకంగా ఒక దేశ ప్రధాన మంత్రే తన పుట్టిన తేదీని మార్చుకుంటున్నారు. కంబోడియా ప్రధానమంత్రి హున్ సేన్ తన అధికారిక పుట్టిన తేదీని, అసలు పుట్టినరోజుకు మార్చాలని నిర్ణయించుకున్నారు. దాదాపు 35 ఏళ్లుగా కంబోడియా ప్రధానిగా మిలిటరీ కమాండర్ గా పదవిలో కొనసాగుతున్న హున్ సేన్..గత కొన్నేళ్లుగా తప్పుడు పుట్టిన తేదీని ఉపయోగిస్తున్నారు. చైనీస్ రాశిచక్ర క్యాలెండర్ ను అనుసరించే ప్రయత్నంలో భాగంగా హున్ సేన్ ఈ విధంగా రెండు పుట్టిన తేదీలను ప్రకటించుకున్నారు.

Other Stories:North Korea: నార్త్‌ కొరియాలో కరోనా విలయం.. కషాయాలు, టీలు తాగండి అంటూ సలహా

తనకు రెండు పుట్టిన తేదీలు ఉన్నాయని, ఒకటి ఏప్రిల్ 4, 1951 అధికారిక పుట్టిన రోజు అయితే, మరొకటి 1952 ఆగస్టు 5 అసలు పుట్టిన తేదీ అని హున్ సేన్ చెప్పారు. అధికారిక రెండు వారాల క్రితం సింగపూర్ నుండి తిరిగి వచ్చిన ప్రధాని హున్ సేన్ సోదరుడు గుండెపోటుతో మృతి చెందిన అనంతరం ఆయన ఈప్రకటన చేశారు. చైనీస్ జోడియాక్ క్యాలండర్ ప్రకారం అధికారిక పుట్టిన తేదీలో రాశిచక్రాలు కలిసి రాక, తనకు వ్యక్తిగతంగా కలిసి రావడం లేదని, అందువల్లే తన సోదరుడిని కోల్పోయాయని ప్రధాని హున్ సేన్ పేర్కొన్నారు.

Other Stories:Rahul Gandhi: పాంగాంగ్ సరస్సుపై చైనా బ్రిడ్జి.. కేంద్రంపై రాహుల్ ఫైర్

రాశిఫలాలను విస్మరించకూడదని నిర్ణయించుకున్న ఆయన పుట్టిన తేదీని మార్చిన తరువాత తాను అనుభవించాల్సిన సంక్లిష్టతలను కూడా అంగీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పుట్టిన తేదీ మార్పుపై ప్రధాని హున్ సేన్ ఇప్పటికే కంబోడియా న్యాయ మంత్రి కౌట్ రిత్ తో చర్చించారు. కాగా కంబోడియాలో 50 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రజలకు రెండు పుట్టినరోజులు ఉండటం సర్వసాధారణం. దీనికి కారణం 1975 నుండి 1979 వరకు ఖ్మేర్ రూజ్ పాలనలో ఉన్న సంవత్సరాల్లో చాలా మంది తమ అధికారిక జనన ధృవీకరణ పత్రాలను కోల్పోయారు. అ౦తేకాకు౦డా, చాలామ౦ది ప్రజలు సైన్యానికి పట్టుబడకుండా ఉ౦డే౦దుకు తప్పుడు పుట్టిన తేదీ ధ్రువపత్రాలను తీసుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు