Somalia Blast: సోమాలియాలో కారు బాంబు పేలుడు.. తొమ్మిది మంది మృతి

సెంట్రల్ సోమాలియాలోని మహాస్ పట్టణ ప్రాంతం కారు బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. వరుసగా రెండు కారు బాంబు పేలుళ్లు చోటు చేసుకోవటంతో తొమ్మిది మంది మరణించారు. పలువురికి గాయాలు కావటంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.

Somalia Blast

Somalia Blast: సెంట్రల్ సోమాలియాలోని మహాస్ పట్టణ ప్రాంతం కారు బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. పేలుడు పదార్థాలు నింపిన వాహనాలతో ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. వరుసగా రెండు కారు బాంబు పేలుళ్లు చోటు చేసుకోవటంతో తొమ్మిది మంది మరణించారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.

Somalia Bomb Explosions : భారీ బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన సోమాలియా.. 100మంది మృతి

స్థానిక భద్రతా అధికారి అబ్దుల్లాహి అదాన్ మాట్లాడుతూ.. ఉగ్రవాదులు ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాన్ని టార్గెట్ గా చేసుకొని దాడులకు తెగబడ్డారని అన్నారు. వరుసగా రెండు కారు బాంబు పేలుళ్లలో తొమ్మిది మంది మరణించినట్లు గుర్తించామని అన్నారు. ఈ దాడికి ఉగ్రవాద సంస్థ అల్ – షబాబ్కు చెందిన జిహాదీ యోధులుగా తెలుస్తోంది.

Somalia Explosions : సోమాలియాలో భారీ పేలుళ్లు.. పలువురు మృతి

మహస్ లోని జిల్లా పరిపాలనా భవనానికి సమీపంలో ఉన్న రెస్టారెంట్ సమీపంలో ఈ పేలుడు సంభవించినట్లు మహాస్ లోని పోలీస్ కమాండర్ ఉస్మాన్ నూర్ అన్నారు. ఈ దాడిలో మృతులంతా అమాయక పౌరులేనని తెలిపారు. ఉగ్రవాదులు పౌరులను భయపెట్టడానికి పేలుళ్లకు పాల్పడ్డారని, అయితే ఇలాంటి ఘటనలతో ప్రజలను బయపెట్టలేరని అన్నారు.