Rapper Cardi B : సింగర్‌పై ఆల్కహాల్ విసిరిన వ్యక్తి.. సీరియస్ అయి సింగర్ ఏం చేసిందో తెలుసా?

ఆర్టిస్ట్‌లు వేదికలపై ప్రదర్శనలు ఇస్తున్నప్పుడు ఒక్కోసారి ప్రేక్షకుల నుంచి ఇబ్బందులు ఎదుర్కుంటారు. తాజాగా అమెరికన్ ర్యాపర్ కార్డి బి చేదు అనుభవం ఎదురైంది.

Rapper Cardi B : సింగర్‌పై ఆల్కహాల్ విసిరిన వ్యక్తి.. సీరియస్ అయి సింగర్ ఏం చేసిందో తెలుసా?

Rapper Cardi B

Updated On : July 30, 2023 / 3:45 PM IST

Rapper Cardi B : ఆర్టిస్ట్‌లు స్టేజ్ మీద ప్రదర్శన ఇస్తున్నప్పుడు ఒక్కోసారి ప్రేక్షకుల నుంచి ఇబ్బందులు ఎదుర్కుంటూ ఉంటారు. తాజాగా అమెరికన్ ర్యాపర్ కార్డి బి ప్రదర్శన ఇస్తుండగా అభిమాని నుంచి ఇబ్బంది ఎదురైంది. వెంటనే ఆమె చేతిలో ఉన్న మైక్ అతనిపై విసిరికొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

China: రాక్ షోలో పాడుతూ ప్యాంటు ఊడదీసిన సింగర్.. పట్టుకెళ్లి లోపలేసిన పోలీసులు

చాలామంది కళాకారులు అభిమానుల నుంచి ఇబ్బందులు ఎదుర్కుంటూ ఉంటారు. తమ చేతిలో ఉన్న వస్తువులు విసరడం.. లేదంటే స్టేజ్ మీదకి వెళ్లడానికి ప్రయత్నించడం వంటివి చేస్తుంటారు.  సీరియస్‌గా  ప్రదర్శన ఇచ్చే సమయంలో కూడా ఆర్టిస్ట్‌లు ఇలాంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా ప్రముఖ అమెరికన్ ర్యాపర్ కార్డి బి వేదికపై తన ప్రదర్శన ఇస్తున్నారు. అంతలో ఓ అభిమాని ఆల్కహాల్ గ్లాస్‌ను ఆమెపైకి చల్లాడు. వెంటనే ఆమె షాక్ అవ్వడమే కాదు.. విపరీతమైన కోపంతో చేతిలో ఉన్నమైక్ అతనిపైకి విసిరింది. ప్రదర్శన మధ్యలో ఇలాంటి ఘటన ఎదురుకావడంతో కలత చెందిన ఆమె అరవడం కూడా మనకు వీడియోలో కనిపిస్తుంది. ఇక కొందరు ఈ పనికి పాల్పడ్డ వ్యక్తిని అక్కడి నుంచి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు.

United States : రెస్టారెంట్‌లో పనిచేస్తున్న ప్రముఖ సింగర్.. అంత కష్టం ఏం వచ్చింది?

కార్డి బి తన ట్విట్టర్ ఖాతాలో (@updatesofcardi) ఈ వీడియోను షేర్ చేసింది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు ‘ప్రజలు ఇలా సెలబ్రిటీలపై వస్తువులను విసరడం మానేయాలి’ అంటూ అభిప్రాయపడ్డారు. ఆర్టిస్ట్‌లు ప్రదర్శన ఇస్తున్నప్పుడు ప్రేక్షకులు వస్తువులు విసరడం ఇది మొదటిసారి కాదు. రీసెంట్‌గా సింగర్ హ్యారీ స్టైల్ వియన్నాలో ప్రదర్శన ఇస్తుండగా వేదికపైకి ఒకరు వస్తువు విసరడంతో అతని కంటికి గాయం అయ్యింది.